Telugu Global
National

నెట్టింట్లో వాట్సాప్ వెడ్డింగ్ ఇన్విటేష‌న్

వ‌చ్చే నెల…. ఫిబ్ర‌వ‌రిలో ఆ ఇద్ద‌రి పెళ్లి. మ‌రి పెళ్లి అంటే ఆషామాషి కాదుగా. జీవితంలో ఒక్క‌సారి జ‌రిగే తంతు. అలాంటి తంతును సింపుల్ గా కాస్తంత క్రియేటివిటీని జోడించి బందు మిత్ర స‌ప‌రివారి స‌మేతంగా గుర్తుపెట్టుకునేలా చేయాల‌ని కాబోయే వ‌రుడు – వ‌ధువు ఆలోచించారు. వ‌రుడు వెబ్ డిజైన‌ర్ కావ‌డంతో వ‌ధువు ఇచ్చిన ఐడియాతో పాత చింతకాయపచ్చడి లాంటి పెళ్లి శుభలేఖలను పక్కనపెట్టి వాట్సాప్ టైప్ లో శుభ‌లేఖ ఉండేలా డిజైన్ చేశాడు. ప్ర‌స్తుతం ఆ […]

నెట్టింట్లో వాట్సాప్ వెడ్డింగ్ ఇన్విటేష‌న్
X

వ‌చ్చే నెల…. ఫిబ్ర‌వ‌రిలో ఆ ఇద్ద‌రి పెళ్లి. మ‌రి పెళ్లి అంటే ఆషామాషి కాదుగా. జీవితంలో ఒక్క‌సారి జ‌రిగే తంతు. అలాంటి తంతును సింపుల్ గా కాస్తంత క్రియేటివిటీని జోడించి బందు మిత్ర స‌ప‌రివారి స‌మేతంగా గుర్తుపెట్టుకునేలా చేయాల‌ని కాబోయే వ‌రుడు – వ‌ధువు ఆలోచించారు.

వ‌రుడు వెబ్ డిజైన‌ర్ కావ‌డంతో వ‌ధువు ఇచ్చిన ఐడియాతో పాత చింతకాయపచ్చడి లాంటి పెళ్లి శుభలేఖలను పక్కనపెట్టి వాట్సాప్ టైప్ లో శుభ‌లేఖ ఉండేలా డిజైన్ చేశాడు.

ప్ర‌స్తుతం ఆ వెడ్డింగ్ ఇన్విటేష‌న్ యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. గుజరాత్‌కు చెందిన ఆర్జూ, చింతన్‌ల పెళ్లి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగబోతోంది. వాళ్ల పెళ్లికి ఇదిగో ఇలా వారం రోజులు క‌ష్ట‌ప‌డి వాట్సాప్ వెడ్డింగ్ కార్డును డిజైన్ చేశారు.

వాట్సాప్ కార్డ్ లో అన్ లాక్, వాట్సప్ లోగోలో వినాయకుడు, వెర్షన్‌లో అనంతం అంటూ డిజైన్ చేశారు. చివ‌ర‌గా మీరు మా పెళ్లికి రాకపోతే వాట్సప్‌లో బ్లాక్ చేస్తాం అని చివర్లో నోట్ పెట్టడం హైలైట్ గా నిలిచింది.

First Published:  4 Jan 2019 11:33 PM GMT
Next Story