నియోజకవర్గం పేరు ప్రకటించిన ప్రకాశ్‌ రాజ్

నటుడు ప్రకాశ్‌ రాజ్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైంది. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కూడా ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించిన ప్రకాశ్‌ రాజ్‌… లోక్‌సభ నియోజకవర్గం పేరు కూడా వెల్లడించారు.

తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాజకీయాల గురించి మాట్లాడుతూ వచ్చిన ప్రకాశ్‌ రాజ్‌… ఈ మూడు రాష్ట్రాలలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపై చర్చ జరిగింది. ఆ చర్చకు ప్రకాశ్‌ రాజే తెరదింపారు. వచ్చే ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ విషయాన్ని స్యయంగా ట్విట్టర్ ద్వారా ప్రకాశ్‌ రాజ్ ప్రకటించారు. తన రాజకీయ ప్రవేశానికి మద్దతు పలికిన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రకాశ్‌ రాజ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది.