Telugu Global
Cinema & Entertainment

"హేయ్ మీ మామయ్య నాగార్జున ఎక్కడ ?"..... నాగార్జున పై బాలకృష్ణ పంచ్

“ఎన్టీఆర్” బయోపిక్ మొదటి భాగం రిలీజ్ డేట్ దగ్గర పడటంతో బాలకృష్ణ దగ్గరుండి మరీ రిలీజ్ పనులు చూసుకుంటున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న బాలకృష్ణ మిగతా టీం అందరిని కూడా ఈ ప్రమోషన్స్ లో భాగం చేసేశాడు. ఈ సినిమా టీం లో భాగం అయిన కళ్యాణ్ రామ్, రానా, ప్రనిత, సుమంత్ లతో ఒక ప్రమోషనల్ వీడియో లో పాల్గొన్నాడు బాలయ్య. అయితే ఈ వీడియో లో మాటల మధ్యలో అక్కినేని […]

హేయ్ మీ మామయ్య నాగార్జున ఎక్కడ ?..... నాగార్జున పై బాలకృష్ణ పంచ్
X

“ఎన్టీఆర్” బయోపిక్ మొదటి భాగం రిలీజ్ డేట్ దగ్గర పడటంతో బాలకృష్ణ దగ్గరుండి మరీ రిలీజ్ పనులు చూసుకుంటున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న బాలకృష్ణ మిగతా టీం అందరిని కూడా ఈ ప్రమోషన్స్ లో భాగం చేసేశాడు.

ఈ సినిమా టీం లో భాగం అయిన కళ్యాణ్ రామ్, రానా, ప్రనిత, సుమంత్ లతో ఒక ప్రమోషనల్ వీడియో లో పాల్గొన్నాడు బాలయ్య. అయితే ఈ వీడియో లో మాటల మధ్యలో అక్కినేని నాగేశ్వర్ రావు టాపిక్ వస్తే ఆయన సుమంత్ కి ఇల్లు రాసిచ్చిన విషయం గురించి చెప్పాడు బాలకృష్ణ.

అప్పుడు సుమంత్ కొంచెం వెటకారంగా ఇంకా ఈ అన్నపూర్ణ స్టూడియోస్ రాసివ్వలేదు అని అన్నాడు. ఇక వెంటనే ఆ కౌంటర్ కి బాలకృష్ణ “హేయ్ మీ మామయ్య నాగార్జున ఎక్కడ ? ఇక్కడ ఈ ఫ్లోర్ లో నాకు ఏసీ రావట్లేదు…. ఓహో నేను, నువ్వు ఉన్నామని మీ మామయ్య పారిపోయి ఉంటాడు” అని పంచ్ వేశాడు నందమూరి బాలకృష్ణ.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యొక్క రెండో భాగం “మహానాయకుడు” ఫిబ్రవరి 7 న రిలీజ్ అవుతుంది.

First Published:  6 Jan 2019 12:08 AM GMT
Next Story