Telugu Global
National

ఎయిర్‌పోర్టు తరహా సిస్టమ్.. రైల్వే కీలక అడుగు

భద్రతకు రైల్వే శాఖ మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఎయిర్‌పోర్టుల తరహాలో రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను, తనిఖీ వ్యవస్థను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా రైలు బయలుదేరడానికి 15 నుంచి 20 నిమిషాల ముందే ప్రయాణికులు స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికులను, వారి లగేజ్‌ను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి లోనికి వదులుతారు. 15 నిమిషాల ముందే వచ్చి తనిఖీ పూర్తి చేసుకున్న ప్రయాణికులను మాత్రమే రైలు వద్దకు అనుమతిస్తారు. తొలి విడతగా […]

ఎయిర్‌పోర్టు తరహా సిస్టమ్.. రైల్వే కీలక అడుగు
X

భద్రతకు రైల్వే శాఖ మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఎయిర్‌పోర్టుల తరహాలో రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను, తనిఖీ వ్యవస్థను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా రైలు బయలుదేరడానికి 15 నుంచి 20 నిమిషాల ముందే ప్రయాణికులు స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికులను, వారి లగేజ్‌ను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి లోనికి వదులుతారు.

15 నిమిషాల ముందే వచ్చి తనిఖీ పూర్తి చేసుకున్న ప్రయాణికులను మాత్రమే రైలు వద్దకు అనుమతిస్తారు. తొలి విడతగా ఈ పద్దతిని 202 స్టేషన్లలో అమలు చేయనున్నారు. కర్నాటకలోని హుబ్లీ స్టేషన్‌లో ఈ పద్దతి ప్రవేశపెట్టారు.

ఈ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్‌లో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల వద్దకు తరహాలో 45 నిమిషాల ముందే రావాల్సిన అవసరం ఏమీ ఉండదని… కేవలం 15 నుంచి 20 నిమిషాల ముందు తప్పనిసరిగా వచ్చి సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుంటే సరిపోతుందని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ వివరించారు.

ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్‌ ఏర్పాటు కోసం రైల్వే శాఖ 385 కోట్లను కేటాయించింది. ఈ కొత్త పద్దతి వల్ల రైలు ప్రయాణికులకు కూడా సౌలభ్యంగా ఉంటుందని చెబుతున్నారు. కేవలం చెకింగ్ పూర్తి చేసుకున్న ప్రయాణికులను మాత్రమే లోనికి పంపడం ద్వారా… రద్దీ సమయాల్లో లేనిపోని ఇబ్బందులు కూడా ఉండవంటున్నారు.

First Published:  6 Jan 2019 3:45 AM GMT
Next Story