ఆయనుంటే ఆ రోజు అసెంబ్లీకి రాను

తెలంగాణ అసెంబ్లీలో సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించే కార్యక్రమానికి ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యేను నియమించడంపై బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ అభ్యంతరం తెలిపారు.

హిందూ వ్యతిరేక పార్టీకి చెందిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా చేయడం తెలంగాణ ప్రజలకే సిగ్గుచేటన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఐఎం ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా ఉండగా ఆయన ముందు ప్రమాణస్వీకారం చేయబోనన్నారు. అందుకే ఆ రోజు తాను సభకు హాజరు కానని వెల్లడించారు.

ఎంఐఎం ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించే విషయంలో కేసీఆర్ మరోసారి పునరాలోచన చేసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్‌ నిర్ణయం మార్చుకుంటే తాను సభకు హాజరై ప్రమాణస్వీకారం చేస్తానన్నారు. బీజేపీ నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజా సింగ్ మాత్రమే బీజేపీ తరపున గెలిచారు.