Telugu Global
Cinema & Entertainment

దర్శకత్వం బాలయ్యదే.... క్రిష్ నామమాత్రం

ఎన్టీఆర్ బయోపిక్ పై కొన్ని నెలలుగా జనాల్లో ఉన్న సందేహానికి ఓ సమాధానం దొరికింది. అన్నీ తానై ఈ బయోపిక్ లో నటిస్తున్న బాలయ్య, సినిమాను డైరక్ట్ కూడా చేసి ఉంటాడనేది అందరి అనుమానం. దీనికి అఫీషియల్ గా ఆన్సర్ దక్కింది. స్వయంగా బాలయ్య ఈ మేటర్ పై స్పందించాడు. అవును.. నేను డైరక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ లో కొన్ని సన్నివేశాలను తాను డైరక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ […]

దర్శకత్వం బాలయ్యదే.... క్రిష్ నామమాత్రం
X

ఎన్టీఆర్ బయోపిక్ పై కొన్ని నెలలుగా జనాల్లో ఉన్న సందేహానికి ఓ సమాధానం దొరికింది. అన్నీ తానై ఈ బయోపిక్ లో నటిస్తున్న బాలయ్య, సినిమాను డైరక్ట్ కూడా చేసి ఉంటాడనేది అందరి అనుమానం. దీనికి అఫీషియల్ గా ఆన్సర్ దక్కింది. స్వయంగా బాలయ్య ఈ మేటర్ పై స్పందించాడు. అవును.. నేను డైరక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు బాలయ్య

ఎన్టీఆర్ బయోపిక్ లో కొన్ని సన్నివేశాలను తాను డైరక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన కొన్ని ఘటనలు క్రిష్ కు అస్సలు తెలియవని, అలాంటి 2-3 సన్నివేశాలను తనే పూర్తిగా డైరక్ట్ చేశానని బాలయ్య చెప్పుకొచ్చాడు. బాలయ్య ఈ విషయం చెబుతున్నప్పుడు పక్కనే క్రిష్ ఉన్నాడు, అవునన్నట్టు తల కూడా ఊపాడు.

బాలయ్య డైరక్ట్ చేశాడనే విషయాన్ని సుమంత్, రానా కూడా నిర్థారించారు. అక్కినేని గెటప్ వేసిన సుమంత్, బాలయ్య సలహాల మేరకే తను నటించానని చెప్పుకొచ్చాడు. అటు రానా కూడా చంద్రబాబు ఆఫ్-స్క్రీన్ లో ఎలా ఉంటారో బాలయ్య ద్వారానే తెలుసుకున్నానని, బాలయ్య సూచనలు తనకు బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చాడు.

First Published:  6 Jan 2019 9:05 AM GMT
Next Story