Telugu Global
International

అత్యంత చెత్త విమానయాన సంస్థ అదే!

ఆ పౌర విమానయాన సంస్థకు అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ అవార్డు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఒకటి కాదు…రెండు కాదు వరుసగా ఆరేళ్లపాటు వరస్ట్ ఎయిర్ లైన్స్ అనే పేరును మూటకట్టుకుంది. బడ్జెట్ ప్రాబ్లమా అంటే అసలే కాదు. అయితే ఆ ఎయిర్ లైన్స్ సంస్థ ఏది అనుకుంటున్నారా? దాని పేరు ర్యాన్ ఎయిర్. మనదేశానికి సంబంధించిన సంస్థ కాదు. లండన్ కు చెందిన విమానయాన సంస్థ అది. ఇంగ్లడ్ లో మొత్తం 19 బ‌డ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థలు […]

అత్యంత చెత్త విమానయాన సంస్థ అదే!
X

ఆ పౌర విమానయాన సంస్థకు అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ అవార్డు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఒకటి కాదు…రెండు కాదు వరుసగా ఆరేళ్లపాటు వరస్ట్ ఎయిర్ లైన్స్ అనే పేరును మూటకట్టుకుంది. బడ్జెట్ ప్రాబ్లమా అంటే అసలే కాదు. అయితే ఆ ఎయిర్ లైన్స్ సంస్థ ఏది అనుకుంటున్నారా? దాని పేరు ర్యాన్ ఎయిర్. మనదేశానికి సంబంధించిన సంస్థ కాదు. లండన్ కు చెందిన విమానయాన సంస్థ అది.

ఇంగ్లడ్ లో మొత్తం 19 బ‌డ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఉన్నాయి… అందులో చివరిస్థానంలో నిలిచింది ర్యాన్ ఎయిర్‌. లండ‌న్‌కు చెందిన ఓ సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ విష‌యం తేలింది. మొత్తం 7,901 మంది ప్ర‌యాణికుల అభిప్రాయాల‌ను సేకరించారు ఆ సంస్థ ప్ర‌తినిధులు. ప్ర‌యాణికుల్లో 70 శాతం మంది ర్యాన్ ఎయిర్ చెత్త సంస్థ‌గా ముక్త‌కంఠంతో తేల్చిచెప్పారు.

ఒక్క‌సారి కూడా ఆ సంస్థ విమానాల్లో ప్ర‌యాణించ‌డానికి ఇష్ట‌ప‌డ‌మ‌ని వెల్ల‌డించారు. వాళ్లింత‌గా అయిష్ట‌త చూప‌డానికి కార‌ణం- హిడెన్ కాస్ట్ ఎక్కువ‌గా ఉంటుందట. మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న జేబుల‌ను ఖాళీ చేసేస్తార‌న్న‌మాట‌.

ర్యాన్ ఎయిర్ ప్ర‌తినిధులు మాత్రం స‌మ‌ర్థించుకుంటున్నారు. ఈ ఆరేళ్ల కాలంలో త‌మ ప్ర‌యాణికుల సంఖ్య 80 శాతం పెరిగిందంటున్నారు.

చెత్త అనేది ఉన్న‌ప్పుడు ఉత్త‌మ అనేది కూడా ఉండాలి క‌దా…. మ‌రి టాప్‌-5లో ఉండే ఎయిర్‌లైన్స్ ఏవంటే…. ఆర‌గ్ని ఎయిర్ స‌ర్వీస్‌, స్విస్ ఎయిర్‌లైన్స్‌, జెట్ 2, నార్వేజియ‌న్‌, కేఎల్ఎం. ఈజీ జెట్ 11వ స్థానంలో నిలవగా, బ్రిటీష్ ఎయిర్‌వేస్ 15 వ స్థానంలో నిలిచింది.

First Published:  5 Jan 2019 9:16 PM GMT
Next Story