ఘోర ప్రమాదం, 10 మంది అయ్యప్ప తెలుగు భక్తుల మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులు చనిపోయారు. మృతులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు.

తమిళనాడులోని పుదుక్కొటై వద్ద ఈ ప్రమాదం జరిగింది . అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న టెంపో వ్యానును కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. అయ్యప్పను దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ్‌ భాస్కర్ పరామర్శించారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కంటైనర్ డ్రైవర్‌ రాంగ్ రూట్‌లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.