Telugu Global
Cinema & Entertainment

"యాత్ర" ట్రైలర్ వచ్చేస్తోంది

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ లో చూసినా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులో అయితే వరుసగా బయోపిక్ లు వస్తున్నాయి. ఇక తెలుగులో లేటెస్ట్ బయోపిక్ “ఎన్టీఆర్ – కథానాయకుడు” సినిమా జనవరి 9 న రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న “యాత్ర” రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ […]

యాత్ర ట్రైలర్ వచ్చేస్తోంది
X

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ లో చూసినా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులో అయితే వరుసగా బయోపిక్ లు వస్తున్నాయి. ఇక తెలుగులో లేటెస్ట్ బయోపిక్ “ఎన్టీఆర్ – కథానాయకుడు” సినిమా జనవరి 9 న రిలీజ్ కానుంది.

ఈ సినిమా తరువాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న “యాత్ర” రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర దర్శక నిర్మాతలు రేపు అంటే జనవరి 7వ తారీఖున సాయంత్రం 5 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

ఈ సినిమా వైఎస్సార్ పాదయాత్ర ఎపిసోడ్ ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పాదయాత్రను ఆపాలి అనే వెనుక ఎవరి కుట్ర ఉంది…. అసలు ఈ సినిమాలో ఎవరు ఏ పాత్రని పోషించారు? అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 8వ తారీఖున విడుదల కానుంది. మహి వి రాఘవ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

First Published:  6 Jan 2019 12:53 AM GMT
Next Story