Telugu Global
Cinema & Entertainment

కొత్త ఏడాదైనా కలిసొస్తుందా..?

2018 దిల్ రాజుకు బొత్తిగా కలిసిరాలేదు. లవర్, శ్రీనివాస కల్యాణం, హలో గురు ప్రేమకోసమే… ఇలా తీసిన 3 సినిమాలు ఫెయిల్ అయ్యాయి. 2017లో వరుస హిట్స్ కొట్టిన ఈ నిర్మాత, 2018లో మాత్రం వరుసగా ఫ్లాపులు ఇచ్చాడు. ఇప్పుడు కొత్త ఏడాదిలో కొత్తగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ఈ నిర్మాత. దిల్ రాజు నిర్మించిన ఎఫ్-2 సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు దిల్ రాజు. ఈ సినిమా హిట్ అయితే […]

కొత్త ఏడాదైనా కలిసొస్తుందా..?
X

2018 దిల్ రాజుకు బొత్తిగా కలిసిరాలేదు. లవర్, శ్రీనివాస కల్యాణం, హలో గురు ప్రేమకోసమే… ఇలా తీసిన 3 సినిమాలు ఫెయిల్ అయ్యాయి. 2017లో వరుస హిట్స్ కొట్టిన ఈ నిర్మాత, 2018లో మాత్రం వరుసగా ఫ్లాపులు ఇచ్చాడు. ఇప్పుడు కొత్త ఏడాదిలో కొత్తగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ఈ నిర్మాత.

దిల్ రాజు నిర్మించిన ఎఫ్-2 సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు దిల్ రాజు. ఈ సినిమా హిట్ అయితే దిల్ రాజుకు ఏడాది గ్యాప్ తర్వాత మంచి బోణీ కొట్టినట్టవుతుంది. తేడా కొడితే ఫ్లాపుల పరంపర కొనసాగుతున్నట్టే.

అయితే ఈసారి ఎఫ్-2పై దిల్ రాజుకు కాస్త గట్టి నమ్మకమే ఉంది. దీనికి ప్రధానంగా 2 కారణాలు. వాటిలో ఒకటి సంక్రాంతి సెంటిమెంట్. సంక్రాంతికి దిల్ రాజు రిలీజ్ చేసిన సినిమాలేవీ గాడితప్పలేదు. ఇక రెండో కారణం దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ డైరక్టర్ తీసిన సినిమాలేవీ ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు. సో.. ఈ రెండు సెంటిమెంట్స్ కలిసొచ్చి తనకు హిట్ దక్కుతుందని ఆశపడుతున్నాడు దిల్ రాజు.

First Published:  7 Jan 2019 7:18 AM GMT
Next Story