Telugu Global
National

బాలకృష్ణకు మూడేళ్ల జైలు... సీఎం అత్యవసర సమావేశం

తమిళనాడు క్రీడాశాఖ మంత్రి బాలకృష్ణా రెడ్డికి జైలు శిక్ష పడింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. 1998 నాటి అల్లర్ల కేసులో ఈ శిక్ష విధించింది కోర్టు. 1998లో వినాయకుడి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో బస్సుల పైన ఇరు వర్గాలు రాళ్లు రువ్వాయి. ఈ కేసులో బాలకృష్ణారెడ్డి దోషిగా తేలవడంతో ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష […]

బాలకృష్ణకు మూడేళ్ల జైలు... సీఎం అత్యవసర సమావేశం
X

తమిళనాడు క్రీడాశాఖ మంత్రి బాలకృష్ణా రెడ్డికి జైలు శిక్ష పడింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది.

1998 నాటి అల్లర్ల కేసులో ఈ శిక్ష విధించింది కోర్టు. 1998లో వినాయకుడి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో బస్సుల పైన ఇరు వర్గాలు రాళ్లు రువ్వాయి.

ఈ కేసులో బాలకృష్ణారెడ్డి దోషిగా తేలవడంతో ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష పడడంతో సీనియర్ మంత్రులతో సీఎం పళనిస్వామి అత్యవసర సమావేశం నిర్వహించారు.

తదుపరి ఏం చేయాలన్న దానిపై చర్చించారు. అయితే ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తున్నట్టు బాలకృష్ణారెడ్డి ప్రకటించారు.

First Published:  7 Jan 2019 6:48 AM GMT
Next Story