Telugu Global
Cinema & Entertainment

"ఎన్టీఆర్" బయోపిక్ పై దగ్గుబాటి కామెంట్స్

“ఎన్టీఆర్” బయోపిక్ సినిమా జనవరి 9 న రిలీజ్ కి రెడీ అవుతుంది అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి తరుణం లో ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఈ బయోపిక్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఆయన వైస్రాయ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ… ఆ రోజు బాలక్రిష్ణ, హరి క్రిష్ణ, చంద్రబాబు నాయుడు… ముగ్గురు కలిసి నా ఇంటికి వచ్చారు. వచ్చి ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి సీట్ నుంచి గద్దె దించడం […]

ఎన్టీఆర్ బయోపిక్ పై దగ్గుబాటి కామెంట్స్
X

“ఎన్టీఆర్” బయోపిక్ సినిమా జనవరి 9 న రిలీజ్ కి రెడీ అవుతుంది అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి తరుణం లో ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఈ బయోపిక్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఆయన వైస్రాయ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ… ఆ రోజు బాలక్రిష్ణ, హరి క్రిష్ణ, చంద్రబాబు నాయుడు… ముగ్గురు కలిసి నా ఇంటికి వచ్చారు. వచ్చి ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి సీట్ నుంచి గద్దె దించడం కోసం నా హెల్ప్ కూడా అడిగారు. అలాగే వైస్రాయ్ లో జరిగే మీటింగ్ లో నన్ను కూడా పాల్గొనమని చెప్పారు.

అసలు ఈ బయోపిక్ లో ఆ వైస్రాయ్ హోటల్ ఇన్సిడెంట్ ని ఎలా చూపిస్తారు, అసలు ఎవరు ఈ కుట్ర వెనక ఉన్నారు అని చూపిస్తారు అనే ఆసక్తి నాలో కూడా ఉంది అని ఆయన చెప్పుకొచ్చాడు. మరి ఈ వైస్రాయ్ హోటల్ ఇన్సిడెంట్ రెండో భాగం అయిన “మహానాయకుడు” లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే నెల ఫిబ్రవరి 7 న రిలీజ్ కానుంది.

First Published:  7 Jan 2019 1:51 AM GMT
Next Story