Telugu Global
CRIME

ఆ వసతి గృహంలో అత్యాచారాలు, అర్ధ నగ్న నృత్యాలు.... సీబీఐ దర్యాప్తులో నిజాలు

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీహార్‌ వసతి గృహం సంఘటనలో పలు భయంకరమైన వాస్తవాలను సీబీఐ వెలికి తీసింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న వసతి గృహంలో బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఘటనలో సీబీఐ 73 పేజీల చార్జిషీటును దాఖలు చేసింది. ఈ ఘటనతో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులకు సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ వసతి గృహాన్ని నిర్వహిస్తున్న బ్రజేష్ ఠాకూర్ అనే వ్యక్తి కనుసన్నల్లోనే ఈ అరాచకాలు చోటు చేసుకున్నట్లు […]

ఆ వసతి గృహంలో అత్యాచారాలు, అర్ధ నగ్న నృత్యాలు.... సీబీఐ దర్యాప్తులో నిజాలు
X

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీహార్‌ వసతి గృహం సంఘటనలో పలు భయంకరమైన వాస్తవాలను సీబీఐ వెలికి తీసింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న వసతి గృహంలో బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఘటనలో సీబీఐ 73 పేజీల చార్జిషీటును దాఖలు చేసింది. ఈ ఘటనతో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులకు సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది.

ఈ వసతి గృహాన్ని నిర్వహిస్తున్న బ్రజేష్ ఠాకూర్ అనే వ్యక్తి కనుసన్నల్లోనే ఈ అరాచకాలు చోటు చేసుకున్నట్లు సీబీఐ అధికారులు తేల్చారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న బాలికలను లైంగికంగా వేధించడమే కాకుండా వారికి డ్రగ్స్ ఇచ్చి.. మత్తులోకి వెళ్లాక వారిపై అత్యాచారం చేసే వారని సీబీఐ చార్జి షీటులో పేర్కొంది. బ్రజేష్ స్నేహితులైన రాజకీయ నాయకులు, అధికారులు ఇక్కడకు తరచూ వచ్చి బాలికలతో అర్థ నగ్న నృత్యాలు చేయిస్తూ పైశాచికానందం పొందే వారనీ సీబీఐ ధృవీకరించింది.

బ్రజేష్ ఠాకూర్

సీబీఐ దర్యాప్తులో బ్రజేష్ ఠాకూర్‌తో సహా 20 మందిపై పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరిలో వసతి గృహం సిబ్బంది కూడా ఉన్నారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న 42 మందిలో 34 మందిపై లైంగిక దాడులు జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. గత 10 ఏండ్లుగా నిర్వహిస్తున్న ఈ గృహంలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ సామాజిక ఆడిట్ చేశాక ఈ భయంకర విషయం వెలుగులోకి వచ్చింది.

మరోవైపు ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్ అధికార జేడీయూతో అత్యంత సన్నిహితంగా మెలిగే వాడు. ఇతనికి ప్రభుత్వ, రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో అతడిని బీహార్ అవతల వేరే జైలులో ఉంచాలని కోర్టు కూడా ఆదేశించింది. అంతే కాకుండా బీహార్ మంత్రి మంజు వర్మ భర్తతో ఇతను పలుమార్లు ఫోన్లో మాట్లాడాడు. ఈ విషయం వెలుగులోనికి వచ్చిన తర్వాత మంజు వర్మ తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు.

ఎందరో అమాయకులైన చిన్నారుల పై లైంగిక వేధింపులకు పాల్పడి…. అత్యాచారాలు చేసిన బ్రజేష్ ఠాకూర్‌కు కఠినమైన శిక్ష వేయాలని పలు బాలల హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

First Published:  7 Jan 2019 2:13 AM GMT
Next Story