Telugu Global
National

మోడీ సంచలన నిర్ణయం : అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు

రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం అని గతంలో చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ…. ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ మోడీ ప్రభుత్వ కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. బిల్లు పార్లమెంటు ఆమోదం తర్వాత రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లను అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ల కోటా […]

మోడీ సంచలన నిర్ణయం : అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు
X

రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం అని గతంలో చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ…. ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ మోడీ ప్రభుత్వ కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.

బిల్లు పార్లమెంటు ఆమోదం తర్వాత రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లను అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ల కోటా అమలులో ఉంటుంది. కీలకమైన ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం మోడీ ప్రభుత్వానికి అనుకూలించే అవకాశం ఉంది.

అయితే ఈ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో పాసవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి పలు డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండగా.. ఈ రిజర్వేషన్ల బిల్లును ఇతర పార్టీలు అంగీకరిస్తాయో లేదో అనే అనుమానం ఉంది.

First Published:  7 Jan 2019 4:41 AM GMT
Next Story