Telugu Global
Cinema & Entertainment

ఇది కామెడీ థ్రిల్లర్ గురూ!

ప్రస్తుతం జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఇదొక పీరియాడిక్ ఎమోషనల్ లవ్ థ్రిల్లర్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ సినిమా గురించి కాదు. జెర్సీ తర్వాత నాని చేయబోయే మూవీ గురించి. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని చేయబోయే సినిమా హిలేరియస్ గా ఉంటుందని, సేమ్ టైం అందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ టైపు కథ నాని ట్రై చేయలేదు. అటు విక్రమ్ కుమార్ కు కూడా ఈ తరహా […]

ఇది కామెడీ థ్రిల్లర్ గురూ!
X

ప్రస్తుతం జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఇదొక పీరియాడిక్ ఎమోషనల్ లవ్ థ్రిల్లర్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ సినిమా గురించి కాదు. జెర్సీ తర్వాత నాని చేయబోయే మూవీ గురించి. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని చేయబోయే సినిమా హిలేరియస్ గా ఉంటుందని, సేమ్ టైం అందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ టైపు కథ నాని ట్రై చేయలేదు. అటు విక్రమ్ కుమార్ కు కూడా ఈ తరహా కథలు కొత్తే. అందుకే ఇద్దరూ కలిసి ఇలా ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. సినిమా సరదాగా సాగిపోతుందట, కానీ అంతర్లీనంగా సస్పెన్స్-థ్రిల్ కొనసాగుతాయట. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోందట. నాని కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. మంచి సీన్స్ పడితే కామెడీ అద్భుతంగా పండిస్తాడు. అలాంటి సన్నివేశాలు ఈ కొత్త సినిమాలో చాలా ఉంటాయట.

ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. వాళ్లు ఎవరనేది ఇంకా నిర్థారించలేదు. మరోవైపు మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. జెర్సీ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే నాని-విక్రమ్ కుమార్ సినిమాపై మరింత స్పష్టత వస్తుంది.

First Published:  7 Jan 2019 6:19 AM GMT
Next Story