Telugu Global
Cinema & Entertainment

మరోసారి పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా మారిన రాజశేఖర్

సీనియర్ హీరో రాజశేఖర్ గరుడవేగ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేసి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ దాదాపు ఏడాది గ్యాప్ తరువాత కొత్త సినిమా స్టార్ట్ చేశాడు రాజశేఖర్. “అ!” ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న “కల్కి” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు రాజశేఖర్. ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామా అని, తెలంగాణ డ్రాప్ లో సాగే చిత్రమని తెలిసిన విషయమే. అయితే ఈ […]

మరోసారి పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా మారిన రాజశేఖర్
X

సీనియర్ హీరో రాజశేఖర్ గరుడవేగ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేసి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ దాదాపు ఏడాది గ్యాప్ తరువాత కొత్త సినిమా స్టార్ట్ చేశాడు రాజశేఖర్.

“అ!” ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న “కల్కి” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు రాజశేఖర్. ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామా అని, తెలంగాణ డ్రాప్ లో సాగే చిత్రమని తెలిసిన విషయమే.

అయితే ఈ సినిమాలో కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయట.ఇక తాజా సమాచారం ప్రకారం ఎలాంటి డూపులు లేకుండా రాజశేఖర్ స్వయంగా కొన్ని అతి కష్టమైన స్టంట్లు ఈ సినిమా కోసం చేశారని సమాచారం.

అలాగే ఈ సినిమాలో ఒక ఏడు నిమిషాల పాటు సాగే ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ 7 నిమిషాల సన్నివేశాన్ని రాజశేఖర్ సింగిల్ టేక్ లో పూర్తి చేసి టీం చేత శభాస్ అనిపించుకున్నాడట. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా వేసవి సెలవుల్లో రిలీజ్ కానుంది.

First Published:  6 Jan 2019 7:02 PM GMT
Next Story