Telugu Global
Cinema & Entertainment

యాత్ర ట్రయిలర్.. సింప్లీ సూపర్బ్

తెలిసిన వ్యక్తుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కరించాలంటే ఆ వ్యక్తులకు సంబంధించిన తెలియని విషయాల్ని బయటపెట్టాలి. మరీ ముఖ్యంగా అలాంటి ప్రముఖుల అంతరంగాన్ని ఆవిష్కరిస్తే ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతారు. దర్శకుడు మహి వి రాఘవ్ అదే చేశాడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమాను రూపొందిస్తున్న ఈ దర్శకుడు.. వైఎస్ఆర్ అంతరంగాన్ని ఆవిష్కరించాడు. కొద్ది సేపటి కిందట యాత్ర ట్రయిలర్ విడుదలైంది. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా ఉన్నది […]

యాత్ర ట్రయిలర్.. సింప్లీ సూపర్బ్
X
తెలిసిన వ్యక్తుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కరించాలంటే ఆ వ్యక్తులకు సంబంధించిన తెలియని విషయాల్ని బయటపెట్టాలి. మరీ ముఖ్యంగా అలాంటి ప్రముఖుల అంతరంగాన్ని ఆవిష్కరిస్తే ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతారు. దర్శకుడు మహి వి రాఘవ్ అదే చేశాడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమాను రూపొందిస్తున్న ఈ దర్శకుడు.. వైఎస్ఆర్ అంతరంగాన్ని ఆవిష్కరించాడు.
కొద్ది సేపటి కిందట యాత్ర ట్రయిలర్ విడుదలైంది. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా ఉన్నది ఉన్నట్టుగా చూపించారు ట్రయిలర్ లో. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో అప్పటి రాజకీయ పరిస్థితులు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనిశ్చితిని యాత్ర ట్రయిలర్ లో చూపించారు. పార్టీలో రాజశేఖర రెడ్డి ఎంత చురుగ్గా వ్యవహరించారు, ఎలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారనే అంశాల్ని ట్రయిలర్ లో చూపించారు.
వైఎస్ఆర్ గా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో ఇప్పటికే ఎట్రాక్ట్ చేసిన మమ్ముట్టి, ట్రయిలర్ తో మెస్మరైజ్ చేశారు. సొంతంగా చెప్పుకున్న డబ్బింగ్ ఆయన కమిట్ మెంట్ కు నిదర్శనంగా నిలిచింది. 70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు.
First Published:  7 Jan 2019 7:14 AM GMT
Next Story