Telugu Global
NEWS

వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డి ఇంటి ముందు వైఎస్‌ వివేకా ఆందోళన

వైఎస్‌ కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైఎస్‌ మరణం తర్వాత పలు అంశాల్లో వైఎస్ కుటుంబంలోనే పదేపదే వివాదాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఏకంగా వైఎస్ సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి… తన సోదరుడి ఇంటి ముందే ఆందోళనకు దిగే పరిస్థితి ఏర్పడింది. పులివెందులలో వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డి ఇంటి ముందు వైఎస్ వివేకానందరెడ్డి ఆందోళనకు దిగారు. ఆస్తుల పంపకం విషయంలో ప్రతాప్ రెడ్డికి, వైఎస్ వివేకానందరెడ్డికి మధ్య విభేదాలు వచ్చినట్టు చెబుతున్నారు. ఆర్ధిక వ్యవహారాల గొడవ కారణంగా  ప్రతాప్ […]

వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డి ఇంటి ముందు వైఎస్‌ వివేకా ఆందోళన
X

వైఎస్‌ కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైఎస్‌ మరణం తర్వాత పలు అంశాల్లో వైఎస్ కుటుంబంలోనే పదేపదే వివాదాలు తలెత్తుతున్నాయి.

ఇప్పుడు ఏకంగా వైఎస్ సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి… తన సోదరుడి ఇంటి ముందే ఆందోళనకు దిగే పరిస్థితి ఏర్పడింది. పులివెందులలో వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డి ఇంటి ముందు వైఎస్ వివేకానందరెడ్డి ఆందోళనకు దిగారు.

ఆస్తుల పంపకం విషయంలో ప్రతాప్ రెడ్డికి, వైఎస్ వివేకానందరెడ్డికి మధ్య విభేదాలు వచ్చినట్టు చెబుతున్నారు. ఆర్ధిక వ్యవహారాల గొడవ కారణంగా ప్రతాప్ రెడ్డి, వివేకానందరెడ్డి మధ్య గొడవ జరుగుతోందని చెబుతున్నారు. ఇప్పుడు వివేకా ఏకంగా ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగడం పులివెందులలో చర్చనీయాంశమైంది.

First Published:  7 Jan 2019 6:16 AM GMT
Next Story