టీమిండియాకు భారీ నజరానా

  • ఒక్కో ఆటగాడికి 15 లక్షల రూపాయల బోనస్
  • చీఫ్ కోచ్ రవిశాస్త్రికి 25 లక్షల రూపాయల నజరానా

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి… గత 71 సంవత్సరాలలో తొలిసారిగా సిరీస్ నెగ్గిన విరాట్ సేనకు… బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.

ప్రధాన జట్టులోని ఒక్క ఆటగాడికి 15 లక్షల రూపాయలు, రిజర్వ్ ఆటగాళ్లకు ఏడున్నర లక్షల రూపాయలు బోనస్ గా ప్రకటించింది.

చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ లకు 25 లక్షల రూపాయలు, సహాయక సిబ్బందికి వారివారి కాంట్రాక్టులకు అనుగుణంగా బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది.

ఆడిన ఒక్కో టెస్ట్ మ్యాచ్ కు 15 లక్షల రూపాయలు మ్యాచ్ ఫీజుగా అందుకొంటున్న టీమిండియా ప్రధాన ఆటగాళ్లు… బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు ద్వారా 7 కోట్ల 50 లక్షల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకూ గ్యారెంటీ మనీ అందుకొంటున్న సంగతి తెలిసిందే.