Telugu Global
Cinema & Entertainment

ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట!

బిగ్ బాస్ 2 ద్వారా బాగా ఫేమస్ అయిన కామన్ మ్యాన్ నూతన్ నాయుడు. బిగ్ బాస్ లాంటి షో తరువాత నూతన్ నాయుడు కి తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయట. ఇప్పటికే తెలుగు లో 14 పెద్ద సినిమాల్లో అలాగే 3 మెగా సీరియల్స్ లో నటిస్తున్నాడట నూతన్ నాయుడు. ఇన్ని ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నా కూడా… ఆయా నిర్మాతలు, దర్శకుల దగ్గరనుండి నూతన్ నాయుడు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదంట. […]

ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట!
X

బిగ్ బాస్ 2 ద్వారా బాగా ఫేమస్ అయిన కామన్ మ్యాన్ నూతన్ నాయుడు. బిగ్ బాస్ లాంటి షో తరువాత నూతన్ నాయుడు కి తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయట.

ఇప్పటికే తెలుగు లో 14 పెద్ద సినిమాల్లో అలాగే 3 మెగా సీరియల్స్ లో నటిస్తున్నాడట నూతన్ నాయుడు. ఇన్ని ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నా కూడా… ఆయా నిర్మాతలు, దర్శకుల దగ్గరనుండి నూతన్ నాయుడు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదంట.

బిగ్ బాస్ 2 షో లో రెమ్యూనరేషన్ లేకుండా పాల్గొన్న నూతన్ నాయుడు…. సినిమాలు, సీరియల్స్ లో కూడా అదే రూల్ ఫాలో అవుతున్నాడట. వరుసగా 14 పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నా ఎవరిదగ్గరా ఇప్పటివరకూ ఒక పైసా కూడా పారితోషికం తీసుకోలేదట. తన అసిస్టెంట్ ఫీజు, ట్రావెల్ టిక్కెట్లు, బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులు తానే పెట్టుకుని షూటింగ్ కి అటెండ్ అవుతున్నాడట.

సీరియల్ నిర్మాతల దగ్గరనుండి కూడా నూతన్ నాయుడు ఒక్క పైసా తీసుకోవడం లేదట. నటన అంటే తనకు ప్యాషన్ అని, నా ప్యాషన్ వేరే వాళ్లకి ఇబ్బంది, భారం అవ్వొద్దు అనే ఉద్దేశంతోనే నూతన్ నాయుడు ఇలా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటిస్తున్నాడట. నూతన్ నాయుడు కమిట్మెంట్, నటన నచ్చి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నూతన్ నాయుడు డేట్స్ కోసం ట్రై చేస్తున్నారట.

First Published:  8 Jan 2019 12:11 AM GMT
Next Story