Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ బయోపిక్ కు చంద్రబాబు వరాలు

బాలయ్య సినిమాకు చంద్రబాబు గేట్లు బార్లా తెరవడం ఇదే తొలిసారి కాదు. గత సంక్రాంతికి కూడా జై సింహా సినిమా వస్తే, ఏపీలో ఎంత సహకారం అందించాలో అంతా చేశారు బాబు. బాలయ్య నటించిన సాదాసీదా సినిమాలకే బాబు నుంచి అంత సహకారం లభిస్తుంటే.. ఏకంగా ఎన్టీఆర్ బయోపిక్ వస్తోంది. అది కూడా ఎన్నికల సీజన్ లో వస్తోంది. అందుకే చంద్రబాబు ఈ సినిమాను తన సొంత పార్టీ కార్యక్రమంగా భావిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి […]

ఎన్టీఆర్ బయోపిక్ కు చంద్రబాబు వరాలు
X

బాలయ్య సినిమాకు చంద్రబాబు గేట్లు బార్లా తెరవడం ఇదే తొలిసారి కాదు. గత సంక్రాంతికి కూడా జై సింహా సినిమా వస్తే, ఏపీలో ఎంత సహకారం అందించాలో అంతా చేశారు బాబు. బాలయ్య నటించిన సాదాసీదా సినిమాలకే బాబు నుంచి అంత సహకారం లభిస్తుంటే.. ఏకంగా ఎన్టీఆర్ బయోపిక్ వస్తోంది. అది కూడా ఎన్నికల సీజన్ లో వస్తోంది. అందుకే చంద్రబాబు ఈ సినిమాను తన సొంత పార్టీ కార్యక్రమంగా భావిస్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే సినిమా యూనిట్, టీడీపీ కలిసిపోయారు. సినిమా ప్రచారం ఎక్కడ జరుగుతున్నా అక్కడ టీడీపీ హంగామా కనిపిస్తోంది. ప్రచార రథాల్ని స్వయంగా టీడీపీ మంత్రులు జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా బయోపిక్ కు ఇతోథికంగా సాయం అందిస్తోంది.

ఈ సినిమాను ఏకంగా వారం రోజుల పాటు విచ్చలవిడిగా ప్రదర్శించుకునేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది చంద్రబాబు సర్కార్. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది. జనవరి 9 నుంచి 16వ తేదీ వరకు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య అదనంగా 2 షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా.. ఈ 8 రోజుల్లో ప్రత్యేకమైన టిక్కెట్టు ధరలు పెట్టుకునే వెసులుబాటు కూడా కల్పించింది.

ఇలా ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఏపీ సర్కార్ చాలా చేస్తోంది. ఎన్నికల వేళ ఎలాగైనా ఈ సినిమాను సూపర్ హిట్ చేసేందుకు కంకణం కట్టుకున్నారు టీడీపీ నేతలు.

First Published:  8 Jan 2019 4:56 AM GMT
Next Story