హృతిక్‌ రోషన్ తండ్రికి క్యాన్సర్‌

బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన హృతిక్… తన తండ్రి అనారోగ్యం గురించి వివరాలు వెల్లడించారు. రాకేశ్ రోషన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు హృతిక్ రోషన్ వివరించారు.

ఇటీవల గొంతుకు సంబంధించిన క్యాన్సర్ తన తండ్రికి వచ్చినట్టు వివరించారు. అయినా సరే తన తండ్రి ధైర్యంగా ఉన్నారని చెప్పారు. సర్జరీ నేడే జరుగుతుందని వివరించారు. సర్జరీ ఉన్నప్పటికీ తన తండ్రి జిమ్ చేయడానికి వచ్చారని… ఆయన చాలా బలమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు.

క్యాన్సర్‌ను జయించడానికి తన తండ్రి సిద్ధమవుతున్నారని చెప్పారు. రాకేష్‌ రోషన్‌ తన కుటుంబంలో ఉన్నందుకు గర్వంగా ఉందని హృతిక్ రోషన్ చెప్పారు.

ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో పలువురు ఇలా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికే సోనాలి బింద్రే, ఇర్ఫాన్ ఖాన్‌లు క్యాన్సర్ బారినపడ్డారు.