Telugu Global
Cinema & Entertainment

"డియర్ కామ్రేడ్" సినిమా కోసం త్యాగం చేసిన రష్మిక

గత ఏడాది “ఛలో” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ రష్మిక. ఆ సినిమాతో హిట్ తో రష్మికకి తెలుగు లో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. అదే ఊపులో రష్మిక “గీత గోవిందం” అనే సినిమాని సైన్ చేసింది. రష్మిక ఏ ముహూర్తాన ఈ సినిమాని సైన్ చేసిందో లేదో తెలియదు గాని సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యి కూర్చుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించాడు. […]

డియర్ కామ్రేడ్ సినిమా కోసం త్యాగం చేసిన రష్మిక
X

గత ఏడాది “ఛలో” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ రష్మిక. ఆ సినిమాతో హిట్ తో రష్మికకి తెలుగు లో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. అదే ఊపులో రష్మిక “గీత గోవిందం” అనే సినిమాని సైన్ చేసింది. రష్మిక ఏ ముహూర్తాన ఈ సినిమాని సైన్ చేసిందో లేదో తెలియదు గాని సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యి కూర్చుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇదిలా ఉంటే ఈ భామ మరోసారి విజయ్ దేవరకొండ సరసన “డియర్ కామ్రేడ్” అనే సినిమాలో నటిస్తుంది.

అయితే ఈ సినిమాలో రష్మిక క్రికెటర్ పాత్ర పోషిస్తుంది. ఈ పాత్ర కోసం రష్మిక తన పొడవాటి జుట్టుని చిన్నది చేసుకోవాల్సి ఉంది, అసలైతే మూవీ యూనిట్ విగ్గు పెట్టి మేనేజ్ చేస్తాం అని చెప్పారు అంట. కానీ రష్మిక మాత్రం విగ్గు పెడితే న్యాచురల్ గా ఉండదు అని చెప్పి నిజంగానే జుట్టు కట్ చేయించుకుంది అంట. రష్మిక అలా ఒక పాత్ర కోసం కట్ చేసుకోవడం చూడగానే టీం అందరూ షాక్ అయ్యారు అంట. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్నాడు.

First Published:  7 Jan 2019 10:27 PM GMT
Next Story