సినిమా ఫ్లాప్…. డబ్బు తీసుకోని హీరోయిన్

రీసెంట్ గా పడి పడి లేచే మనసు సినిమా చేసింది హీరోయిన్ సాయిపల్లవి. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. ఇంకా చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ అయింది. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సాయిపల్లవి హర్ట్ అయింది. పైగా నిర్మాతకు నష్టం రావడంతో తట్టుకోలేకపోయింది. అందుకే ఈ సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు సాయిపల్లవి.

పడి పడి లేచే మనసుకు సంబంధించి సాయిపల్లవికి ఇంకా 40 లక్షలు ఇవ్వాలట నిర్మాత. రీసెంట్ గా ఆ మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కానీ సాయిపల్లవి మాత్రం ఆ డబ్బు తీసుకోవడానికి నిరాకరించింది. సినిమా ఫ్లాప్ అయి కష్టాల్లో ఉన్న నిర్మాతకు సాయపడేందుకు ఆ మొత్తం తీసుకోలేదట.

సినిమా విడుదలకు ముందే ముక్కుపిండి మరీ డబ్బు మొత్తం తీసుకుంటారు నటీనటులు. పేమెంట్ పెండింగ్ ఉంటే సినిమా విడుదలకు కూడా ఒప్పుకోరు. అలాంటిది 40 లక్షలు బాకీ ఉన్నప్పటికీ సినిమా రిలీజ్ కు ఓకే చెప్పింది సాయిపల్లవి. ఇప్పుడు సినిమా ఫెయిల్ అవ్వడంతో, ఆ 40 లక్షలు కూడా తీసుకునేందుకు నిరాకరించింది.