Telugu Global
Sankranthi Essay

వివిధ రాష్ట్రాల్లో.... వివిధ రకాలుగా సంక్రాంతి

మ‌న ద‌గ్గ‌ర సంక్రాంతి మూడు రోజుల పండుగ‌. దేశంలో చాలా చోట్ల ఇది ఒక్క‌రోజు చేసుకునే పండుగ‌. ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు.

వివిధ రాష్ట్రాల్లో.... వివిధ రకాలుగా సంక్రాంతి
X

వివిధ రాష్ట్రాల్లో.... వివిధ రకాలుగా సంక్రాంతి

మ‌న ద‌గ్గ‌ర సంక్రాంతి మూడు రోజుల పండుగ‌. దేశంలో చాలా చోట్ల ఇది ఒక్క‌రోజు చేసుకునే పండుగ‌. ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. ఒక్కో ర‌కంగా వేడుక చేసుకుంటారు. తెలుగు వాళ్లు నువ్వులు-బెల్లంతో అరిశెలు చేసుకుంటే, మ‌హారాష్ట్ర‌లో తిల్‌గుల్ పేరుతో నువ్వుల ఉండ‌లు చేసుకుంటారు. క‌ర్నాట‌క‌లో అదే కాంబినేష‌న్‌తో ఎల్లుబెల్ల తింటారు. మ‌హారాష్ట్ర‌లో కొన్ని ప్రాంతాల్లో న‌ల్ల‌దుస్తులు వేసుకుంటారు.

మ‌న ద‌గ్గ‌ర సంక్రాంతి మూడు రోజుల పండుగ‌. దేశంలో చాలా చోట్ల ఇది ఒక్క‌రోజు చేసుకునే పండుగ‌. ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. ఒక్కో ర‌కంగా వేడుక చేసుకుంటారు.

తిల్‌గుల్

తెలుగు వాళ్లు నువ్వులు-బెల్లంతో అరిశెలు చేసుకుంటే, మ‌హారాష్ట్ర‌లో తిల్‌గుల్ పేరుతో నువ్వుల ఉండ‌లు చేసుకుంటారు. క‌ర్నాట‌క‌లో అదే కాంబినేష‌న్‌తో ఎల్లుబెల్ల తింటారు.

ఎల్లుబెల్ల

మ‌హారాష్ట్ర‌లో కొన్ని ప్రాంతాల్లో న‌ల్ల‌దుస్తులు వేసుకుంటారు. అతి శీత‌ల వాతావ‌ర‌ణంలో ఆరోగ్యంగా ఉండాలంటే బ‌య‌టి వేడిని పీల్చుకుని దేహానికి వెచ్చ‌ద‌నాన్నివ్వ‌డం కోసం న‌ల్ల‌ని దుస్తుల‌ను ధ‌రించాల‌ని చెబుతారు.

ఉత్త‌ర భార‌తంలో సంక్రాంతి నుంచి పుణ్య‌స్నానాల ప‌ర్వం మొద‌ల‌వుతుంది. అల‌హాబాద్‌, హ‌రిద్వార్‌, వార‌ణాసి వంటి చోట్ల వేలాదిగా పుణ్య‌స్నానాలు ఆచ‌రిస్తారు. ఉత్త‌రాఖండ్ ప్రాంతం నుంచి వ‌ల‌స వెళ్లిన ప‌క్షులు సంక్రాంతి రోజు నుంచి గుంపులు గుంపులుగా స్వ‌స్థానాల‌కు వ‌స్తాయి. వాటికి స్వాగ‌తం ప‌లుకుతూ పిల్ల‌లు ర‌క‌ర‌కాల గింజ‌ల‌ను చ‌ల్లుతారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో… సంక్రాంతిని ఖిచిరి అంటారు. అల‌హాబాద్‌లోని ప్ర‌యాగ‌లో మాఘ‌మేళా, కుంభ‌మేళాలు నిర్వ‌హిస్తారు.
ప‌శ్చిమ బెంగాల్‌లో… గంగాసాగ‌ర్ మేళా నిర్వ‌హిస్తారు. హుగ్లీ న‌దిని ప్ర‌క్షాళ‌నం చేసే కార్య‌క్ర‌మం ఇది. దేశంలో ఎక్క‌డెక్క‌డ ఉన్న బెంగాలీయులంద‌రూ ఈ పండుగ‌కు సొంతూళ్ల‌కు చేరుకుంటారు.

గంగాసాగ‌ర్ మేళా

త‌మిళ‌నాడులో… మ‌క‌ర సంక్రాంతి పండుగ‌ను పొంగ‌ల్ అటారు. కొత్త ధాన్యంతో తీపి పొంగ‌లి చేసుకుని దేవునికి నివేద‌న చేసి ఆ ప్ర‌సాదాన్ని స్వీక‌రిస్తారు. కొత్త పంట‌లు వ‌చ్చిన సంద‌ర్భాన్ని బంధువులు, స్నేహితుల‌తో సంబ‌రంగా గ‌డ‌ప‌డ‌మే ఇందులో ప‌ర‌మార్థం.

క‌ర్నాట‌క‌లో… ఎల్లుబెల్ల పేరుతో నువ్వులు బెల్లం వంట‌కాల‌ను తింటారు. ఒక‌రికొక‌రు పంచుకుంటారు.

మ‌హారాష్ట్ర‌లో… సంక్రాంతి రోజు రంగురంగుల‌ నువ్వుల ల‌డ్డూల‌ను పంచుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డ‌మే ఇందులో ఉద్దేశం. ప‌ల్లీచిక్కీ కూడా తప్ప‌నిస‌రిగా తింటారు.

అస్సాంలో… మ‌క‌ర సంక్రాంతి రోజున ”బిహు” అనే సంప్ర‌దాయ వేడుక నిర్వ‌హిస్తారు. దానిని వాళ్లు ”భోగి బిహు” అంటారు.


బిహు

పంజాబ్‌లో… చ‌లిమంట‌ల‌కు ఒళ్లు కాచుకోవ‌డాన్ని వేడుక‌లా చేసుకుంటారు. డిసెంబ‌రు, జ‌న‌వ‌రి నెల‌ల్లో ఉష్ణోగ్ర‌త‌లు విప‌రీతంగా ప‌డిపోతాయ‌క్క‌డ‌. సంక్రాంతి రోజు లోహ్రీ పేరుతో పెద్ద నెగ‌ళ్ల‌తో మంట‌లు వేసి మంద‌పాటి రంగురంగుల దుస్తులు ధ‌రించి సంప్ర‌దాయ నృత్యాలు చేస్తారు. సిక్కులు ఈ పండుగ‌ను ”మాఘి” అంటారు. మోక్ష‌ప్ర‌దాయినిగా భావిస్తారు.

లోహ్రీ

గుజ‌రాత్‌లో… సంక్రాంతిని ఉత్త‌రాయ‌ణం అంటారు. మ‌న‌కు తెలంగాణ‌లో ఉన్న‌ట్లు గుజ‌రాత్‌లో కూడా ఈ పండుగ‌ రోజు ప‌తంగుల వేడుక చేస్తారు. సామూహికంగా గాలిప‌టాలు ఎగుర‌వేయ‌డానికి నెల ముందు నుంచే స‌న్నాహాలు చేసుకుంటారు.

రాజ‌స్థాన్‌లో… ఘెవార్‌, తిల్‌ప‌ట్టీ, ఘ‌జ‌క్‌, ఖీర్ అనే స్వీట్లు చేసుకుంటారు. ఇక్క‌డ ”స‌క్రాత్ భోజ్‌” ప్ర‌ధాన‌మైన‌ది. అంటే బంధువుల‌ను, స్నేహితుల‌ను విందు భోజ‌నానికి ఆహ్వానించ‌డం.

బీహార్‌, జార్ఖండ్‌ల‌లో… సాధార‌ణ ఆహారం రొట్టెల‌కు బ‌దులు అన్నం, అన్నంలోకి ర‌క‌ర‌కాల కాంబినేష‌న్ ప‌దార్థాలు వండుకుంటారు.

కాశ్మీర్‌లో… సంక్రాంతి పండుగ‌ను శిశుర్ సంక్రాత్ అంటారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న‌ట్లే గుజ‌రాత్ తీర‌ప్రాంతాల్లో కూడా కోడిపందేల దురాచారం ఉంది. త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు పేరుతో ఎడ్ల పందేలు, దున్న‌పోతుల పందేలు మ‌రీ బీభ‌త్సంగా జ‌రుగుతుంటాయి. ఒక‌ప్పుడు వాటి మీద నిషేధం ఉండేది.

సంప్ర‌దాయం పేరుతో ప‌ట్టుప‌ట్టి మ‌రీ అనుమ‌తి తెచ్చుకున్నారు వాళ్లు. కేర‌ళ‌లో ఏనుగుల ఉత్స‌వం జ‌రుగుతుంది. ఇది ఎవ‌రికీ హాని క‌లిగించ‌ని రీతిలో ఆహ్లాదంగా సాగుతుండ‌డంతో దాని మీద నిషేధం లేదు.

First Published:  13 Jan 2023 10:27 AM GMT
Next Story