Telugu Global
Cinema & Entertainment

ఈ సంక్రాంతికి నవ్వులే నవ్వులు

సంక్రాంతికి మాస్ సినిమాలు ఎంత క్లిక్ అవుతాయో.. కుటుంబ కథా చిత్రాలు కూడా అంతే బాగా క్లిక్ అవుతాయి. కొన్ని దశాబ్దాలుగా సంక్రాంతి బాక్సాఫీస్ చరిత్ర ఈ విషయాన్ని చాటిచెబుతోంది. ఈ సంక్రాంతికి కూడా అలాంటి సినిమాలు 2 సిద్ధమయ్యాయి. వీటిలో కంప్లీట్ మాస్ మూవీ వినయ విధేయ రామ కాగా, పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో పాటు కామెడీ టచ్ ఉన్న సినిమా ఎఫ్-2. ఎఫ్-2 సినిమా కామెడీగా ఉండబోతోందనే విషయం టీజర్ తోనే […]

ఈ సంక్రాంతికి నవ్వులే నవ్వులు
X

సంక్రాంతికి మాస్ సినిమాలు ఎంత క్లిక్ అవుతాయో.. కుటుంబ కథా చిత్రాలు కూడా అంతే బాగా క్లిక్ అవుతాయి. కొన్ని దశాబ్దాలుగా సంక్రాంతి బాక్సాఫీస్ చరిత్ర ఈ విషయాన్ని చాటిచెబుతోంది. ఈ సంక్రాంతికి కూడా అలాంటి సినిమాలు 2 సిద్ధమయ్యాయి. వీటిలో కంప్లీట్ మాస్ మూవీ వినయ విధేయ రామ కాగా, పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో పాటు కామెడీ టచ్ ఉన్న సినిమా ఎఫ్-2.

ఎఫ్-2 సినిమా కామెడీగా ఉండబోతోందనే విషయం టీజర్ తోనే స్పష్టమైంది. తాజాగా రిలీజైన ట్రయిలర్ తో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. వెంకీ, వరుణ్ హీరోలుగా నటించిన ఎఫ్-2 ట్రయిలర్ విడుదలైంది. ట్రయిలర్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. వెంకీ కామెడీ టైమింగ్ కు తోడు, ఫస్ట్ టైం కామెడీ చేసిన వరుణ్ తేజ్ కూడా ఆకట్టుకోవడంతో ట్రయిలర్ ట్రెండింగ్ గా నిలిచింది.

అనీల్ రావిపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమా 15 ఏళ్ల కిందటొచ్చిన కొన్ని సినిమాల్ని గుర్తుకుతెస్తోంది. అప్పట్లో శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, శివాజా లాంటి హీరోలు ఈ తరహా కథల్లో నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆ జానర్ కు అనీల్ రావిపూడి తెరపైకి తీసుకొచ్చాడు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాలో తమన్న, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు.

First Published:  8 Jan 2019 10:17 AM GMT
Next Story