“యాత్ర” ప్రీరిలీజ్ ఈవెంట్ కు జగన్ ఫ్యామిలీ?

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా “యాత్ర”. అయితే ఈ సినిమాలో ఆయన జీవితంలో కీలక ఘట్టం అయిన పాదయాత్రని చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు మహి వి రాఘవ్. మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. పాదయాత్ర ముందు మరియు పాదయాత్ర సమయంలో వైయస్సార్ కు ఎదురు పడిన అడ్డంకులు ట్రైలర్ లో చూపించారు.

వచ్చే నెల ఫిబ్రవరి 8 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక అదే నెల ఒకటవతారీకు వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మూవీ యూనిట్. ఇక ఈ ఈవెంట్ కి జగన్ ఫ్యామిలీ మొత్తం తరలి రానున్నారు అంట. అవును వైఎస్ ఆర్ భార్య విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల ముఖ్య అతిధులుగా రానున్నారు.  ఇక ఈ ఈవెంట్ కి జగన్ అభిమానులు వైఎస్సార్ అభిమానులు కూడా వేలమంది తరలిరానున్నారు అని తెలుస్తుంది.