క్రిష్ కూడా వెబ్ సిరీస్ లోకి దిగాడు

తెలుగు డైరెక్టర్ అయిన క్రిష్ బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కూడా సినిమాలు తీసి సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు బాలక్రిష్ణ తో “ఎన్టీఆర్” బయోపిక్ డైరెక్ట్ చేసిన క్రిష్ ప్రస్తుతం వేరే ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించాడు. అయితే తాజా సమాచారం ప్రకారం క్రిష్ వెబ్ సిరీస్ బిజినెస్ లోకి దిగబోతున్నాడు అని తెలిసింది. ఇప్పటికే సీరియల్స్ కి కథని అందిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న క్రిష్ ఇటివలే వరుణ్ తేజ్ హీరోగా “అంతరిక్షం” సినిమాని కూడా ప్రొడ్యూస్ చేసాడు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు క్రిష్.

తమిళ్ లో ‘రాజా రాజా చోల ‘ కథ పై రూపొందబోతున్న వెబ్ -సీరీస్ ని క్రిష్ నిర్మించబోతున్నాడు. సురేష్ కృష్ణ దర్శకత్వం లో ఈ వెబ్-సీరీస్ రూపొందబోతుంది. ఈ సీరీస్ 6 భాగాల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సీరీస్ ని క్రిష్ తెలుగు లో కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఇకపోతే రాజమౌళి కూడా ఆర్క మీడియా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న “బాహుబలి” వెబ్ సిరీస్ లో సహా నిర్మాతగా ఉన్నాడు అని టాక్. ఇక ఇప్పుడు క్రిష్ కూడా వెబ్ సిరీస్ విషయం లో రాజమౌళి ఫాలో అవుతున్నాడు.