Telugu Global
Cinema & Entertainment

"NTR " కథానాయకుడు" సినిమా రివ్యూ

రివ్యూ: NTR – కథానాయకుడు రేటింగ్‌:  2.25/5 తారాగణం:  బాలకృష్ణ, విద్యాబాలన్ తదితరులు సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి నిర్మాత:  బాలకృష్ణ, సాయి కూరపాటి, విష్ణు ఇందూరి దర్శకత్వం:  క్రిష్ జాగర్లమూడి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నందమూరి తారకరామారావు బయోపిక్ అనౌన్స్ చేసినప్పుడే దీని మీద ఆసక్తి మొదలైంది. అందులోనూ బాలకృష్ణ స్వయంగా నిర్మించి, తనే టైటిల్ రోల్ చేస్తుండటంతో ఇంకా ప్రత్యేకత సంతరించుకుంది. క్రిష్ దర్శకత్వానికి తోడు కీరవాణి సంగీతం ఆకర్షణగా నిలిచింది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు. బెజవాడ […]

NTR  కథానాయకుడు సినిమా రివ్యూ
X

రివ్యూ: NTR – కథానాయకుడు
రేటింగ్‌: 2.25/5
తారాగణం: బాలకృష్ణ, విద్యాబాలన్ తదితరులు
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
నిర్మాత: బాలకృష్ణ, సాయి కూరపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నందమూరి తారకరామారావు బయోపిక్ అనౌన్స్ చేసినప్పుడే దీని మీద ఆసక్తి మొదలైంది. అందులోనూ బాలకృష్ణ స్వయంగా నిర్మించి, తనే టైటిల్ రోల్ చేస్తుండటంతో ఇంకా ప్రత్యేకత సంతరించుకుంది. క్రిష్ దర్శకత్వానికి తోడు కీరవాణి సంగీతం ఆకర్షణగా నిలిచింది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు.

బెజవాడ రిజిస్టర్ ఆఫీస్ లో ప్రభుత్వ ఉద్యోగాన్ని అక్కడి అధికారులు లంచం తీసుకుంటున్నారన్న కారణంగా వదిలేస్తాడు రామారావు (బాలకృష్ణ). నాటక రంగంలో అనుభవం ఉండటంతో భార్య బసవతారకం (విద్యా బాలన్) అంగీకారంతో తనకు ఆఫర్ ఇచ్చిన ఎల్వీ ప్రసాద్ ను వెతుక్కుంటూ మదరాసు వచ్చేస్తాడు. విజయా సంస్థ అండతో స్టార్ గా ఎదుగుతాడు. మాయాబజార్ లో కృష్ణుడి వేషంతో అగ్రస్థానానికి చేరుకుంటాడు. ఏఎన్ఆర్ (సుమంత్) మంచి స్నేహితుడిగా ప్రతి పనిలో అండగా ఉంటాడు. ఈ క్రమంలో ప్రజా సమస్యలు చూసి చలించిపోయిన రామారావు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీని ప్రకటిస్తాడు. మిగిలింది వచ్చే నెల 8న విడుదలయ్యే రెండో భాగం మహానాయకుడులో చూసుకోవాలి.

ఎన్టీఆర్ పాత్రకు బాలయ్యను మించిన ఛాయస్ లేదు. అయితే ట్రైన్ జీవిత కాలం లేట్ తరహాలో ఓ 15 ఏళ్ళ క్రితం తీయాల్సిన మూవీని చాలా లేట్ ఏజ్ లో తీయడం వల్ల బాగా ప్రభావం పడింది. వయసు రిత్యా వచ్చిన విపరీతమైన మార్పులను బాలయ్య దాచలేకపోయాడు. నటన పరంగా ఎంత మెప్పించినా ఈ లోపం స్క్రీన్ మీద వెలితిగా వెంటాడుతూనే ఉంటుంది. ఇది పక్కన పెట్టి చూస్తే బాలకృష్ణ నాన్న పాత్రలో చెలరేగిపోయాడు.

హీరో ఎన్టీఆర్ గా కంటే కెరీర్ చరమాంకంలో రాజకీయాల వైపు మళ్లుతున్న నాయకుడిగా వేషం బాగా నప్పింది. యధావిధిగా చేసుకుంటూ పోయాడు. కాకపోతే ఎన్టీఆర్ ను మరిపించే స్థాయిలో లేకపోవడంతో మనకు ఎంతసేపూ ఎన్టీఆర్ స్థానంలో బాలయ్య మాత్రమే కనిపిస్తాడు. భార్య బసవతారకంగా విద్యా బాలన్ జీవించేసింది. కళ్యాణ్ రామ్ ఉన్నది కొన్ని సీన్స్ అయినా గుర్తుండిపోతాడు. ప్రకాష్ రాజ్, మురళి శర్మలు ఫస్ట్ హాఫ్ లో బాగానే కనిపిస్తారు. రొటీన్ పాత్రలే.

ఎన్టీఆర్ తమ్ముడిగా దగ్గుబాటి రాజాకు చివరి దాకా ఉండే పాత్ర దొరికింది. ఇన్నాళ్లు ఎందుకు మాయమయ్యాడో అర్థం కాదు. ఇక ఈ పేజీ సరిపోనంత మంది ఆర్టిస్టులు ఉన్నారు కానీ అందరివీ రెండు నిమిషాల లోపు పాత్రలే.

దర్శకుడు క్రిష్ ఒక విజన్ తో ఇది తీసాడు. అది ఎన్టీఆర్ ను కేవలం ఒక మహోన్నత వ్యక్తిగా తిరుగులేని సమ్మోహన శక్తిగా చూపించడం… దానికి కట్టుబడి స్క్రిప్ట్ రాసుకోవడంతో ఎక్కడా డ్రామాకు అవకాశం లేకుండా పోయింది. బయోపిక్స్ లో ఇవి ఆశించడం తప్పే కానీ ఎమోషనల్ గా కనెక్ట్ కావడం చాలా ముఖ్యం.

పెద్దబ్బాయి చనిపోయినప్పుడు, తన సినిమా బాక్సులు ల్యాబులో ఇరుక్కుపోయాయి అని తెలిసినప్పుడు లాంటి రెండు మూడు ఎపిసోడ్స్ తప్పించి మిగిలిన సినిమాలో అధిక శాతం ఆర్టిఫీషియల్ గా సాగుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఒకదశలో వరసగా వస్తున్న పాత సినిమాల బిట్స్ చూస్తే ఇదేదో టీవీలో ఎన్టీఆర్ కోసం తయారు చేసిన డాక్యుమెంటరీ అని కూడా అనిపిస్తుంది. ఏదో అలా సాగిపోతుంది కానీ స్క్రీన్ ప్లే బిగుతుగా ఉన్నట్టు అనిపించదు.

మహానటి వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు కాబట్టి వద్దన్నా దానితో పోలిక కనిపిస్తుంది. ఆ కోణంలో చూస్తే ఎన్టీఆర్ లో అంత ఫీల్ లేదు. ఎన్టీఆర్ జీవితం చాలా సాఫీగా సాగినట్టు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వెళ్లినట్టు చూపించడంతో ప్రేక్షకుడు ఎగ్జైట్ అయ్యే అవకాశం కనిపించలేదు. దానికి తోడు బాలకృష్ణ, దగ్గుబాటి రాజా పాత్రలు తప్ప ఎవరికీ ఎక్కువ ప్రాధాన్యం లేకుండా చేయడం కూడా కొంత వరకు మైనస్ గా నిలిచింది.

భారీగా సాగిన నిర్మాణం, తెరనిండా ఆర్టిస్టులు…. లోపాలను కవర్ చేసే ప్రయత్నం దాదాపుగా చేశాయి. అందుకే పూర్తిగా నిరాశ పరిచే బాపతులో పడకుండా ఎన్టీఆర్ తప్పించుకుంది. కీరవాణి ఉన్న తక్కువ పాటలతో ప్లస్ బీజీఎమ్ తో దీనికి అండగా నిలిచారు. జ్ఞాన శేఖర్ ఛాయాగ్రహణం బాగుంది. బాలయ్యను చాలా సార్లు మరీ దగ్గరగా చూపించడం కొంత నెగటివ్ అయ్యింది. సాయి మాధవ్ బుర్రా డైలాగులు సందర్భోచితంగా అతి లేకుండా సాగాయి. హీరోతో కలిపి దీనికి తోడైన మరో ఇద్దరు నిర్మాతలు రాజీ ప్రస్తావన లేకుండా ఖర్చు పెట్టారు

చివరిగా చెప్పాలంటే ఒక వ్యక్తి జీవితంగా ఎన్టీఆర్ కథానాయకుడు చూస్తే జస్ట్ ఓకే అనిపిస్తుంది కానీ తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక లెజెండ్ కథగా చూస్తే మాత్రం పూర్తి సంతృప్తి కష్టమే. కాకపోతే అభిమానులకు నచ్చేలా తీయడంతో క్రిష్ సక్సెస్ అయ్యాడు కాబట్టి కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కానీ ఫైనల్ గా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలవడం అనుమానమే. మహానటి రేంజ్ లో కాకపోయినా ఓమోస్తరుగా నిరాశ పరచకుండా సాగుతుంది అని మనం ఆశించవచ్చు.

First Published:  9 Jan 2019 10:50 AM GMT
Next Story