నందినీరెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. నందిని రెడ్డి దగ్గర కూడా పెద్దగా టైమ్ లేదు, సమంతా తో ‘మిస్ గ్రానీ’ సినిమా పనులతో బిజీ బిజీగా ఉంది. అయితే దొరికిన కాస్త టైమ్ లోనే వీళ్లిద్దరూ కథాచర్చలకు కూర్చున్నారు. అవును.. విజయ్ దేవరకొండకు ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పింది నందినీరెడ్డి. ప్రస్తుతానికైతే మేటర్ ఇక్కడివరకు వచ్చి ఆగింది. విజయ్ దేవరకొండ ఇంకా తన నిర్ణయం చెప్పలేదు.

ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఆ తర్వాత మైత్రీలోనే మరో మూవీ ఉంది. ఇంత బిజీ షెడ్యూల్స్ లో నందినీరెడ్డికి ఎలా అవకాశం ఇస్తాడో చూడాలి. అటు నందినీరెడ్డి కూడా ఖాళీగా లేదు. సమంతతో మిస్ గ్రానీ సినిమాను రీమేక్ చేస్తోంది. సో.. వీళ్లిద్దరి కాంబో సెట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది.

మొన్నటివరకు దర్శకుడితో సంబంధం లేకుండా సినిమా చేశాడు దేవరకొండ. కథ బాగుంటే కాల్షీట్లు ఇచ్చాడు. కానీ కొత్త ఏడాదిలో మాత్రం స్టార్ డైరక్టర్లతో సినిమాలు చేస్తానని ఆల్రెడీ ప్రకటించాడు. కొరటాల, శేఖర్ కమ్ముల, పూరి లాంటి దర్శకులు ఇంట్రెస్ట్ కూడా చూపించారు. ఈ నేపథ్యంలో నందినీరెడ్డికి విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇస్తాడా అనేది పెద్ద ప్రశ్న.