సీక్రెట్ గా ఫాలో అవుతున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “వినయ విధేయ రామ”. మొట్ట మొదటి సారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటిస్తున్నాడు కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 11 న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే ఈ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయటపెట్టాడు.

అందేంటంటే రామ్ చరణ్ ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్ ఇంష్టగ్రం అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి అందరిని ఫాలో అవుతున్నాడట. నాకు కూడా అందరికి గురించి తెలుసుకోవాలి అని ఉంటుంది, అలాగే అసలు బయట ప్రపంచంలో ఎం జరుగుతుందో తెలుసుకోవాలి అని కూడా ఉంటుంది అందుకే సీక్రెట్ గా ఇంష్టగ్రం అకౌంట్ మైంటైన్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఇక పూర్తీ స్తాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన “వినయ విధేయ రామ” తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అనే నమ్మకంతో రామ్ చరణ్ ఉన్నాడు.