Telugu Global
NEWS

రేవంత్ రెడ్డి అనుచరుడి కిడ్నాప్‌

అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌, రేవంత్ రెడ్డి మధ్య వేడి తగ్గడం లేదు. సర్పంచ్‌ ఎన్నికల సందర్భంగా మరోసారి ఇరు వర్గాలు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అనుచరుడు విశ్వనాథ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిటూరు గ్రామానికి చెందిన విశ్వనాథ్‌ కాంగ్రెస్ తరపున సర్పంచ్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నేడు నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో రాత్రి రెండుగంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విశ్వనాథ్‌ను […]

రేవంత్ రెడ్డి అనుచరుడి కిడ్నాప్‌
X

అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌, రేవంత్ రెడ్డి మధ్య వేడి తగ్గడం లేదు. సర్పంచ్‌ ఎన్నికల సందర్భంగా మరోసారి ఇరు వర్గాలు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అనుచరుడు విశ్వనాథ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిటూరు గ్రామానికి చెందిన విశ్వనాథ్‌ కాంగ్రెస్ తరపున సర్పంచ్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నేడు నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇంతలో రాత్రి రెండుగంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విశ్వనాథ్‌ను ఆయన ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ఆచూకీ లేదు. నామినేషన్‌కు నేడే చివరి రోజు కావడంతో విశ్వనాథ్‌ పోటీ చేయకుండా అడ్డుకునేందుకే ఈ కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి నిటూరు గ్రామానికి వెళ్లి అనుచరులతో చర్చించారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడారు.

విశ్వనాథ్‌ను బరిలో లేకుండా చేస్తే టీఆర్‌ఎస్ గెలుస్తుందన్న ఉద్దేశంతోనే ఈ కిడ్నాప్ చేశారని రేవంత్ రెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు.

ఈ గ్రామంలో గతంలో ఫ్యాక్షన్ హత్యలు కూడా జరిగాయి. దీంతో విశ్వనాథ్‌ను కేవలం నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకే కిడ్నాప్ చేశారా… లేక ప్రాణహాని ఏమైనా తలపెట్టి ఉంటారా? అన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది.

First Published:  9 Jan 2019 2:30 AM GMT
Next Story