మరోసారి అనసూయకి అవకాశం ఇచ్చిన సుకుమార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ సినిమాగా “మహర్షి” చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ వారు అలాగే దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వం లో ఒక చిత్రం లో నటించబోతున్నాడు అనే సంగతి అందరికి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం కథ సిద్ధం చేస్తున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం హాట్ యాంకర్ అనసూయని తీసుకోనున్నాడు అంట సుకుమార్. తానూ రాసుకున్న ఆ పాత్రకి అనసూయ అయితేనే సెట్ అవుతుంది అని భావించి ఈ డెసిషన్ తీసుకున్నాడు అంట సుకుమార్. ఇప్పటికే “రంగస్థలం” సినిమాలో అనసూయ కి రంగమత్త అనే పాత్ర ఇచ్చిన సుకుమార్ మరి ఇప్పుడు అనసూయ కోసం ఎలాంటి పాత్ర రాస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. త్వరగా ప్రీ ప్రొడక్షన్ పూర్తీ చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ సినిమా ధియేటర్స్ లో సందడి చేయనుంది.