రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటున్న అనుష్క

తెలుగు లేడీ సూపర్ స్టార్ అనుష్క ని అభిమానులు స్క్రీన్ మీద చూసి దాదాపు ఏడాది కావొస్తుంది. గత ఏడాది “భాగమతి” సినిమా చేసిన అనుష్క ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాని కూడా సైన్ చెయ్యలేదు. ఇక ఇటీవలే యూరోపియన్ స్పా నుండి ట్రీట్మెంట్ ని పూర్తి చేసుకుని ఇండియా కి తిరిగి వచ్చింది అనుష్క. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో ఒక మూవీ లో అలాగే కోన వెంకట్ నిర్మాణం లో రోపొందబోతున్న మరొక సినిమా లో కనిపించబోతున్నట్టు టాక్ అయితే ఉంది.
ఈ రెండు సినిమాలు కూడా మాములు బడ్జెట్ తో రూపొందబోతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు ఎక్కవు శాతం ఫారిన్ లో షూట్ జరుపుకోనున్నాయి. అందుకే ఈ రెండు సినిమాలకి కలిపి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలి అని అనుష్క డిసైడ్ అయ్యింది అంట. తమిళ్ సూపర్ స్టార్ అయిన నయనతార ఒక్కో సినిమా కి 4-5 కోట్ల పారితోషకాన్ని తీసుకుంటుంటే, అనుష్క మాత్రం కేవలం 1. 25 కోట్లను మాత్రమే తీసుకోనుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ దేవసేన ప్రొడ్యూసర్స్ కష్టాలని గుర్తించి వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ఈ డెసిషన్ తీసుకుంది అంట.