శంకర్ సినిమాలో సౌత్ కొరియన్ నటి

ఈ మధ్యనే ‘2.0’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన శంకర్ ఇప్పుడు విలక్షణ నటుడు కమల్ హాసన్ తో ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ తీయనున్నాడు. ఈ చిత్రం ఈ నెల 18 వ తారీకు నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ, చెన్నై, కొరియా, బ్యాంకాక్, తైవాన్ లోని కొన్ని అద్భుతమైన  లొకేషన్లలో జరగనుంది. ఈ సినిమా కోసం లైకా ప్రొడక్షన్స్ వారు 200 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. క్వాలిటీ పరంగా ఏ మాత్రం రాజీపడకుండా మరొక బ్లాక్ బస్టర్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు శంకర్.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కాజల్ కొన్ని యాక్షన్ సన్నివేశాలలో కూడా నటించనుంది. సినిమాలో తన పాత్ర కోసం మేర కళరియపట్టు అనే విద్యను కూడా నేర్చుకుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమాలో ఒక సౌత్ కొరియన్ నటి నటించనుంది. సౌత్ కొరియాలో పాపులర్ సింగర్ మరియు నటి అయిన బే సూజి ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనుంది. సౌత్ కొరియా లోనే పాపులర్ హీరోయిన్లలో ఒకరైన బే సుజీ సింగర్ కూడా. ఇప్పుడు సౌత్ ఇండియా సినిమాలో ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె ఈ సినిమాలో నటించడం సినిమాకు పెద్ద అసెట్ అవుతుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది.