Telugu Global
NEWS

అగ్రవర్ణ పేదలకు ఫలం... రాష్ట్రపతి సంతకమే తరువాయి...

దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది. భారీ మెజారిటీతో లోక్‌సభలో నెగ్గిన బిల్లు…. రాజ్యసభ సభలోనూ భారీ మద్దతును కూడగట్టుకుంది. ఓటింగ్ సమయంలో రాజ్యసభలో 172 మంది సభ్యులుండగా 165 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. కేవలం ఏడుగురు మాత్రమే వ్యతిరేకించారు. దాదాపు అన్ని ప్రధాన పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చాయి. ఉభయసభల్లోనూ నెగ్గిన బిల్లును ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు పంపారు. రాష్ట్రపతి సంతకం చేస్తే […]

అగ్రవర్ణ పేదలకు ఫలం... రాష్ట్రపతి సంతకమే తరువాయి...
X

దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది. భారీ మెజారిటీతో లోక్‌సభలో నెగ్గిన బిల్లు…. రాజ్యసభ సభలోనూ భారీ మద్దతును కూడగట్టుకుంది.

ఓటింగ్ సమయంలో రాజ్యసభలో 172 మంది సభ్యులుండగా 165 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. కేవలం ఏడుగురు మాత్రమే వ్యతిరేకించారు. దాదాపు అన్ని ప్రధాన పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చాయి. ఉభయసభల్లోనూ నెగ్గిన బిల్లును ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు పంపారు. రాష్ట్రపతి సంతకం చేస్తే ఈబీసీ కోటా అమలులోకి వస్తుంది.

First Published:  9 Jan 2019 8:08 PM GMT
Next Story