Telugu Global
NEWS

కంగారూ గడ్డపై ఇక తీన్మార్ వన్డే షో

హాట్ ఫేవరెట్ గా రెండోర్యాంకర్ టీమిండియా సిడ్నీ వేదికగా తొలిసమరానికి కౌంట్ డౌన్ ఆస్ట్రేలియాలో… టీమిండియా 64 రోజుల పర్యటన లో ఆఖరి ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది. తీన్మార్ వన్డే సిరీస్ కు…సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఆరో ర్యాంకర్ ఆస్ట్రేలియాతో జరుగనున్న ఈ సిరీస్ లో సైతం…రెండో ర్యాంకర్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. క్లయ్ మాక్స్ లో కంగారూ వేట….  కంగారూ ల్యాండ్ లో టీమిండియా జైత్రయాత్ర…ముగింపు దశకు […]

కంగారూ గడ్డపై ఇక తీన్మార్ వన్డే షో
X
  • హాట్ ఫేవరెట్ గా రెండోర్యాంకర్ టీమిండియా
  • సిడ్నీ వేదికగా తొలిసమరానికి కౌంట్ డౌన్

ఆస్ట్రేలియాలో… టీమిండియా 64 రోజుల పర్యటన లో ఆఖరి ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది. తీన్మార్ వన్డే సిరీస్ కు…సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఆరో ర్యాంకర్ ఆస్ట్రేలియాతో జరుగనున్న ఈ సిరీస్ లో సైతం…రెండో ర్యాంకర్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది.

క్లయ్ మాక్స్ లో కంగారూ వేట….

కంగారూ ల్యాండ్ లో టీమిండియా జైత్రయాత్ర…ముగింపు దశకు చేరింది. తీన్మార్ టీ-20 సిరీస్ ను 1-1తో డ్రాగా ముగించి…నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-1తో నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించిన టీమిండియా….తీన్మార్ వన్డే సిరీస్ కు సైతం గురి పెట్టింది.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే తీన్మార్ సిరీస్ తొలి వన్డేలో …రెండో ర్యాంకర్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

టాప్ గేర్ లో టీమిండియా….

టెస్ట్ సిరీస్ విజయంతో గాల్లో తేలిపోతున్న టీమిండియా… పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ తో కంగారూ బౌలర్లకు సవాలు విసురుతోంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాయుడు, విరాట్ కొహ్లీ, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, హార్థిక్ పాండ్యా, రాహుల్ లాంటి ఆటగాళ్లతో టీమిండియా బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా, సమతూకంతో కనిపిస్తోంది.

బుమ్రాకు రెస్ట్…. సిరాజ్ కు చాన్స్….

ఇక..బౌలింగ్ లో యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో…భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్ తో పాటు స్పిన్ దళం కుల్దీప్ యాదవ్,చాహల్, జడేజా, జాదవ్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారు.

బుమ్రా స్థానంలో జట్టులో తొలిసారిగా చేరిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్…తుదిజట్టులో చోటు కోసం తహతహలాడుతున్నాడు. అవకాశం దొరికితే సత్తా చాటుకోడానికి సిద్ధమని ప్రకటించాడు.

ఫించ్ కెప్టెన్సీలో ఆసీస్ సవాల్….

మరో వైపు…డాషింగ్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలోని కంగారూ టీమ్ బ్యాటింగ్ కు…హ్యాండ్స్ కోంబ్, షాన్ మార్ష్, మిషెల్ మార్ష్, ఉస్మాన్ క్వాజా, మాక్స్ వెల్, అలెక్స్ క్వారే, మార్కుస్ స్టోయినిస్ కీలకం కానున్నారు.

బౌలింగ్ లో వెటరన్ పీటర్ సిడిల్, స్టాన్ లెకీ, బెహ్రెన్ డోర్ఫ్, రిచర్డ్ సన్, స్పిన్ జోడీ ఆడం జంపా, నేథన్ లయన్….టీమిండియా టాపార్డర్ తో అమీతుమీ తేల్చుకోనున్నారు.

మ్యాచ్ కు వేదికగా ఉన్న సిడ్నీ స్టేడియం వికెట్ …స్ట్రోక్ మేకర్లతో పాటు…స్పిన్ బౌలర్లకు అనువుగా ఉండడంతో….300కు పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రన్ మెషీన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలోని పవర్ ఫుల్ టీమిండియాకు…ఆస్ట్రేలియా ఏమాత్రం పోటీ ఇస్తుందో తెలుసుకోవాలంటే…. ఈ మూడుమ్యాచ్ ల సిరీస్ ముగిసే వరకూ వేచిచూడక తప్పదు.

First Published:  10 Jan 2019 6:12 AM GMT
Next Story