ప్రొడ్యూసర్ గా నాని, హీరోయిన్ గా సమంత

“అ!”  సినిమాతో గత ఏడాది ప్రొడ్యూసర్ గా తెలుగు ఇండస్ట్రీ లో కొత్త అవతారం ఎత్తాడు నాని. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఆ సినిమా నానికి మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. ఇక ఆ తరువాత హీరోగా వరుస సినిమాలతో బిజీ అయిన నాని…. ఇప్పుడు మళ్ళీ మరో సినిమాను నిర్మించాలనుకుంటున్నాడట.

ఇక ఇటీవలే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ నాని దగ్గరకి ఒక లేడీ ఓరియెంటెడ్ కథ తీసుకొని వచ్చి ప్రొడ్యూస్ చేయమని కోరాడట. కథ నచ్చిన నాని ఇందులో మెయిన్ లీడ్ పాత్రకి సమంత అయితే బాగుంటుంది అని చెప్పాడట. దీంతో విజయేంద్ర ప్రసాద్ కూడా సమంతాకే ఓకే చెప్పాడట.

ఇదిలా ఉంటే నాని, సమంతా గతంలో “ఎటో వెళ్ళిపోయింది మనసు” “ఈగ” వంటి సినిమాల్లో కలిసి నటించారు. అతి త్వరలోనే సమంతాతో సినిమాని ప్రొడ్యూస్ చేస్తాడట నాని. ఇకపోతే ప్రస్తుతం నాని “జెర్సీ” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.