ఎన్టీఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్

తండ్రి నందమూరి తారకరామారావు బయోపిక్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు బాలయ్య. ఈ సినిమా కోసం తనే స్వయంగా నిర్మాతగా కూడా మారాడు. అలా అన్నీ తానై క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా నిన్న రిలీజైంది. మొదటి రోజు ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఓపెనింగ్స్ మాత్రం బాగున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాకు 10 కోట్లకు పైనే నెట్ వసూళ్లు వచ్చాయి. బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. మరోవైపు గౌతమీపుత్ర శాతకర్ణి ఓపెనింగ్స్ ను కూడా క్రాస్ చేసింది. ఏపీ, నైజాంలో ఈ సినిమా మొదటి రోజు షేర్ ఇలా ఉంది.
నైజాం – రూ. 1.75 కోట్లు
సీడెడ్ – రూ. 0.85 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.85 కోట్లు
ఈస్ట్ – రూ. 41 లక్షలు
వెస్ట్ – రూ. 55 లక్షలు
గుంటూరు – రూ. 2.03 కోట్లు
కృష్ణా – రూ. 74 లక్షలు
నెల్లూరు – రూ. 52 లక్షలు