ముసలాడే కానీ గట్టోడు

కాంచన-3 కోసం కంప్లీట్ గా గెటప్ మార్చేశాడు రాఘవ లారెన్స్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఏప్రిల్ 18 న సినిమా రిలీజవుతుందని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే  సోషల్ మీడియాలో   మాత్రం ఈ సినిమాకి సంబంధించిన చర్చ కంటే, లారెన్స్ గెటప్ పైనే ఎక్కువ ఫోకస్ పడింది. దీనికి కారణం లారెన్స్ ముసలి గెటప్ లో కనిపించడమే.

తెల్లజుట్టుతో దర్జాగా కూర్చున్న లారెన్స్ స్టిల్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. తమిళ సినిమాల్లో తెల్లజుట్టు కొత్తేంకాదు. హీరో అజిత్ ఎప్పుడూ అలానే కనిపిస్తాడు. కానీ లారెన్స్ ఇలా చేయడం ఫస్ట్ టైం. మరీ ముఖ్యంగా ఈ లుక్ కు, సినిమాకు ఏంటి లింక్ అనే కోణంలో చర్చ జోరుగా సాగుతోంది.

ముని సినిమా నుంచి కాంచన, కాంచన-2 సినిమాల వరకు ప్రతి సిరీస్ తో హిట్ కొడుతున్నాడు లారెన్స్. అందుకే కాంచన-3పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూనిట్, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ఠాగూర్ మధు సమర్పిస్తున్నాడు.