Telugu Global
National

రైతులు తమ బలమేంటో మోదీకి చూపించారు: రాహుల్

రాజస్థాన్ లో అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పర్యటించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే …..రైతులకు అన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. జైపూర్ లో నిర్వహించిన కిసాన్ ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు తమ బలం ఏమిటో ప్రధానికి చూపించారన్న రాహుల్… మోదీ రైతులను విస్మరించారని ఎద్దేవా చేశారు. అంతేకాదు రఫేల్‌పై చర్చ నుంచి మోదీ పారిపోయారని […]

రైతులు తమ బలమేంటో మోదీకి చూపించారు: రాహుల్
X

రాజస్థాన్ లో అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పర్యటించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే …..రైతులకు అన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

జైపూర్ లో నిర్వహించిన కిసాన్ ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు తమ బలం ఏమిటో ప్రధానికి చూపించారన్న రాహుల్… మోదీ రైతులను విస్మరించారని ఎద్దేవా చేశారు. అంతేకాదు రఫేల్‌పై చర్చ నుంచి మోదీ పారిపోయారని రాహుల్ విమర్శించారు.

ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. కానీ పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ కారణంగా చిన్న వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. దేశాన్ని అనిల్‌ అంబానీకి దోచి పెట్టారు. రఫేల్‌పై లోక్‌సభలో చర్చించడానికి కనీసం ఒక్క నిమిషం కూడా మోదీ రాలేకపోయారు.

రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రఫేల్‌పై రెండున్నర గంటల పాటు ప్రసంగించారు కానీ….. నేనడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు ఇవ్వలేదు. ఆమె మోదీని కాపాడేందుకు ప్రయత్నించారు కానీ అది కుదరలేదు.

ప్రధానిని మేం అగౌరవ పరచడం లేదు. కానీ రఫేల్ ఒప్పందం పేరిట అనిల్‌ అంబానీకి రూ.30వేల కోట్లు ఇచ్చారు. రఫేల్‌పై తప్పకుండా జేపీసీ విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు.

First Published:  9 Jan 2019 8:04 PM GMT
Next Story