కత్తులతో పొడుచుకున్న అగ్రహీరోల ఫ్యాన్స్‌…. నలుగురి పరిస్థితి విషమం

తమిళనాడులో అగ్రహీరోల ఫ్యాన్స్ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో వేలూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రజనీకాంత్, అజిత్‌ ఫ్యాన్స్ ఇలా దాడులు చేసుకున్నారు.

తమిళనాడులో రజనీకాంత్‌ నటించిన ”పేట”, అజిత్ నటించిన ”విశ్వాసం” సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరి సినిమా ఎంత హిట్‌ అన్న దానిపై పోటీ నడుస్తోంది. ఇది ముదిరి వేలూరులో  హీరోల ఫ్యాన్స్ కత్తులతో దాడి చేసుకున్నారు.

కత్తుల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫ్యాన్స్ గొడవ నేపథ్యంలో వేలూరులో పోలీసులు మోహరించారు.