చైతూ భుజాల పైకి ఎక్కిన సమంత

ఈమధ్య మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు నాగచైతన్య, సమంత. పెళ్లయిన తర్వాత పూర్తిగా సినిమాలకే టైమ్ కేటాయించిన ఈ జంట.. హనీమూన్ కూడా జరుపుకోలేదు. ఇన్నాళ్లకు వీళ్లకు అనుకోకుండా టైమ్ దొరికింది. ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. క్రిస్మస్, సంక్రాంతి సీజన్ కావడంతో సమయం చిక్కింది. అంతే, వెంటనే విదేశాలకు చెక్కేసింది ఈ జంట.

చైతూ, సమంత విదేశాల్లో ఎంజాయ్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సమంతను తన భుజాలపైకి ఎక్కించుకొని చైతూ హంగామా చేస్తున్న ఫొటో ఎక్కువగా వైరల్ అవుతోంది. వీటితో పాటు కేక్ మిక్సింగ్ లో చైతూ-సమంత పాల్గొన్నారు.

ప్రస్తుతం వీళ్లిద్దరి చేతిలో చెరో సినిమా ఉంది. వెంకీ మామ సినిమా కోసం నాగచైతన్య రెడీ అవుతున్నాడు. మరోవైపు నందినీరెడ్డి దర్శకత్వంలో మిస్ గ్రానీ అనే సినిమా చేస్తోంది సమంత. ఈ రెండు సినిమాలు కాకుండా ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి మజిలీ అనే సినిమా కూడా చేస్తున్నారు.