బయోపిక్ డైరెక్ట్ చేస్తా- బోయపాటి శ్రీను

 కొన్నేళ్ళ ముందు వరకు యాక్షన్ సినిమాల డైరెక్టర్స్ అంటే మనకి బి.గోపాల్, వి.వి వినాయక్ మాత్రమే గుర్తొచ్చే వారు. కానీ ఇప్పుడు మాత్రం బోయపాటి శ్రీను ఒక్కడి పేరు మాత్రమే వినబడుతుంది.

ఎటువంటి ప్రయోగాలకి పోకుండా కేవలం హీరోఇజంని, అలాగే ఎమోషన్స్ ని నమ్ముకునే సినిమాలు తీస్తున్నాడు బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా “వినయ విధేయ రామ”.

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ మసాలా సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో కొత్తదనం ఉండదు అనేది అందరికీ తెలుసు. కానీ యాక్షన్ సీక్వెన్స్ ని బోయపాటి ఎలా డైరెక్ట్ చేసాడు అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న బోయపాటి శ్రీను, తానూ ఫ్యూచర్ లో ఒక బయోపిక్ తప్పకుండా డైరెక్ట్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. తానూ ఎవరి బయోపిక్ తీసినా కూడా తన మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ అందులో కూడా ఉంటాయి అని బోయపాటి శ్రీను హామీ ఇస్తున్నాడు.

మరి ప్రస్తుతం బాలక్రిష్ణ తో మూడో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్న బోయపాటి శ్రీను ఎవరి బయోపిక్ ని డైరెక్ట్ చేస్తాడో చూడాలి.