పోలీసుల భయంతో చీకట్లో బావిలోకి దూకేశారు… అంతే…

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరులో విషాదం నెలకొంది. పోలీసులకు భయపడి ఇద్దరు యువకులు బావిలో పడిపోయారు.

గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అర్థరాత్రి దాడులు చేశారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న జనం పరుగులు తీశారు.

ఎవరికి తోచిన దారిలో వారు పారిపోయారు. ఈ క్రమంలో చిత్తూరు శీను, చిన్నారావులు పారిపోతూ బావిలో పడిపోయారు. చీకట్లో దారి తెలియక,  ముందు బావి ఉన్న విషయం తెలియక నేరుగా బావిలో పడిపోయారు.

దాంతో చనిపోయారు. ఆలస్యంగా గుర్తించిన గ్రామస్తులు మృతదేహాలను బయటకు తీశారు.
గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.