డేరా బాబా కథ క్లోజ్

వివాదాస్పద డేరా బాబాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పంచకుల ప్రత్యేక కోర్టు ఆయన్ను హత్య కేసులో దోషిగా తేల్చింది. జర్నలిస్ట్‌ చత్రపతి హత్య కేసులో డేరా బాబుతో పాటు మరో నలుగురిని దోషులుగా కోర్టు తేల్చింది.

ఈనెల 17న దోషులకు శిక్షలను కోర్టు ఖరారు చేయనుంది. 2002లో జర్నలిస్ట్‌ రాంచందర్‌ చత్రపతి హత్య జరిగింది.

2002లో జర్నలిస్ట్‌ చత్రపతి తన పత్రికలో డేరా బాబా ఆశ్రమంలో జరుగుతున్న అకృత్యాలు, మహిళలపై లైంగిక దాడుల గురించి వివరణాత్మకంగా కథనాన్ని రాశారు. దాంతో ఆయన్ను డేరా బాబు బ్యాచ్ హత్య చేసింది. 2003లో డేరా బాబాపై కేసు నమోదు కాగా… 2006లో కేసును సీబీఐకి బదిలీ చేశారు.

ఈ హత్య కేసులో డేరాబాబాను ప్రధాన సూత్రధారిగా సీబీఐ గుర్తించింది. డేరా బాబాకు ఇప్పటికే ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.