కీర్తిసురేష్ మరో సినిమా ఒప్పుకుంది

 ఆమెకంటూ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సెపరేట్ ఇమేజ్ ఉంది. ఆమె క్రేజ్ చాలా ప్రత్యేకం. ఇదంతా మహానటి సినిమా తెచ్చిన వైభోగం. అందుకే టాలీవుడ్ లో ఆచితూచి అడుగులేస్తోంది కీర్తిసురేష్. కేవలం తన పాత్రకు ప్రాధాన్యం ఉండే పాత్రల్ని మాత్రం చేస్తోంది. ఇందులో భాగంగా మహానటి తర్వాత కీర్తిసురేష్ చేయబోయే కొత్త సినిమా పక్కా అయింది. ఆ మూవీ లాంఛింగ్ కూడా జరిగింది.

నరేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈస్ట్-కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ సినిమా నిర్మించబోతున్నాడు నిర్మాత మహేష్ కోనేరు. ఈ సినిమాలో కీర్తిసురేష్ ను లీడ్ రోల్ కింద తీసుకున్నారు. ఇది పూర్తిగా మహిళా ప్రాధాన్యంగా సాగే సినిమా. తప్పకుండా మహిళా లోకానికి నచ్చుతుందంటున్నాడు నిర్మాత

అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈరోజు జరిగిన ఈ ప్రారంభోత్సవానికి కల్యాణ్ రామ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. కీర్తిసురేష్ పై క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించాడు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. కథ ప్రకారం.. 25శాతం షూటింగ్ ఇండియాలో చేస్తే, మిగతా 75 శాతం షూటింగ్ ను అమెరికాలో చేయబోతున్నారు. ఈ మేరకు తన తమిళ సినిమా డేట్స్ అన్నింటినీ సర్దుబాటు చేసింది కీర్తిసురేష్.