Telugu Global
NEWS

125 డేస్ కౌంట్‌ డౌన్ మొదలైంది

జగన్ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో…. జగన్‌ను విమర్శిస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాసిన లేఖపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. లేఖలో కొత్తగా ఏమీ లేదన్నారు. కొనుక్కున్న గొర్రెలతో చంద్రబాబే లేఖ రాయించారన్నారు. అమ్ముడుపోయిన గొర్రెలు చంద్రబాబు చెప్పగానే లేఖపై సంతకాలు చేశాయన్నారు. 2004కు ముందు కూడా ఎల్లో పత్రికలు ఇదే తరహాలో రాజశేఖర్‌ రెడ్డి పై తప్పుడు కథనాలు రాశాయని…. కానీ ప్రజలు వైఎస్‌ను గెలిపించారన్నారు. జగన్‌ పాదయాత్రకు వచ్చిన స్పందన చూసి టీడీపీ నేతలకు […]

125 డేస్ కౌంట్‌ డౌన్ మొదలైంది
X

జగన్ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో…. జగన్‌ను విమర్శిస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాసిన లేఖపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. లేఖలో కొత్తగా ఏమీ లేదన్నారు. కొనుక్కున్న గొర్రెలతో చంద్రబాబే లేఖ రాయించారన్నారు. అమ్ముడుపోయిన గొర్రెలు చంద్రబాబు చెప్పగానే లేఖపై సంతకాలు చేశాయన్నారు.

2004కు ముందు కూడా ఎల్లో పత్రికలు ఇదే తరహాలో రాజశేఖర్‌ రెడ్డి పై తప్పుడు కథనాలు రాశాయని…. కానీ ప్రజలు వైఎస్‌ను గెలిపించారన్నారు. జగన్‌ పాదయాత్రకు వచ్చిన స్పందన చూసి టీడీపీ నేతలకు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. జగన్‌ ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే తిరిగి దించడం అయ్యే పని కాదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు చెప్పినట్టుగా పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.

చంద్రబాబు లాంటి నీచాతినీచుడే లేడని స్వయంగా ఎన్టీఆరే చెప్పారన్నారు. చంద్రబాబు అండ్ టీం ఆరు లక్షల కోట్లు దోచుకుందని…. సాక్ష్యాలతో సహా తాము చెబుతుంటే…. టీడీపీ నేతలు మాత్రం రాష్ట్ర బడ్జెట్టే ఆరు లక్షల కోట్లు లేదని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. 25వేల కోట్ల విలువైన ఇసుకను, నీరు- చెట్టులో 45వేల కోట్లు, అమరావతిలో లక్షల కోట్ల విలువైన భూమిని దోపిడి చేశారని… ఇవన్నీ బడ్జెట్లో ఎందుకుంటాయని ప్రశ్నించారు.

రోడ్ల వెంబడి తిరుగుతూ అమ్మనా బూతులు తిడుతున్న పవన్‌ కల్యాణ్‌ను కూడా…. వచ్చి కలవాలని పిలుపునివ్వడానికి చంద్రబాబుకు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు చిల్లర పనులు 40 ఏళ్లుగా ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు.

స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు లాంటి వారిని చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. చంద్రబాబు మాటలు వింటూ సభను నడిపే అసమర్థ స్పీకర్‌ ఉండడం వల్లే తాము సభకు వెళ్లలేదన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో ఇరగదీస్తానని వెళ్లిన చంద్రబాబును అక్కడి ప్రజలు బట్టలూడదీసి కొట్టి పంపించారన్నారు. కేసీఆర్‌కు సమాధానం చెప్పడం చంద్రబాబుకు చేతగాదు గానీ… టీడీపీ ఊరకుక్కలు మాత్రం మొరుగుతూ ఉంటాయన్నారు.

చంద్రబాబు 125 డేస్ కౌంట్‌ డౌన్ మొదలైందన్నారు. ఐదు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా జగన్‌ యాత్రకు జనం రావడం లేదు అనడం విచిత్రంగా ఉందన్నారు.

First Published:  11 Jan 2019 3:25 AM GMT
Next Story