Telugu Global
NEWS

ఎన్టీఆర్‌ ఒక అమ్మాయికి కడుపు చేసి రోడ్డున పడేశాడు " నాదెండ్ల

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌ రావు సంచలన విషయాలు చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో నాటి సంగతులను వివరించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడులు తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆఫీస్‌ చుట్టూ తిరుగుతూ చిన్నచిన్న ట్రాన్స్‌ఫర్లు చేయిస్తూ వారిచ్చే ఐదువందలు, వెయ్యి కమిషన్లు తీసుకుని బతికేవారన్నారు. ఇంట్లో వండేందుకు బియ్యం కూడా లేవంటూ వెంకయ్యనాయుడు తనతో కొన్ని బదిలీలపై సంతకాలు పెట్టించుకున్నారని వివరించారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన సమయంలో చంద్రబాబు తొలుత తన వద్దకే వచ్చారన్నారు. కానీ పార్టీ అధ్యక్షుడిగా మీ […]

ఎన్టీఆర్‌ ఒక అమ్మాయికి కడుపు చేసి రోడ్డున పడేశాడు  నాదెండ్ల
X

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌ రావు సంచలన విషయాలు చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో నాటి సంగతులను వివరించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడులు తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆఫీస్‌ చుట్టూ తిరుగుతూ చిన్నచిన్న ట్రాన్స్‌ఫర్లు చేయిస్తూ వారిచ్చే ఐదువందలు, వెయ్యి కమిషన్లు తీసుకుని బతికేవారన్నారు. ఇంట్లో వండేందుకు బియ్యం కూడా లేవంటూ వెంకయ్యనాయుడు తనతో కొన్ని బదిలీలపై సంతకాలు పెట్టించుకున్నారని వివరించారు.

టీడీపీలో చేరేందుకు సిద్ధమైన సమయంలో చంద్రబాబు తొలుత తన వద్దకే వచ్చారన్నారు. కానీ పార్టీ అధ్యక్షుడిగా మీ మామగారే ఉన్నారు కదా వెళ్లి మాట్లాడుకో అని సూచించగా….. ”వాడెవడు అన్న… సినిమా ల’** కొడుకు. దొంగ నాకొడుకు, వరకట్నం పది లక్షలు ఇస్తానని చెప్పి డొక్కు కారు ఇచ్చాడు. వాడు మామూలు మనిషి కాదు దొంగనాకొడుకు” అంటూ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చంద్రబాబు దూషించారని భాస్కర్ రావు వివరించారు. ఆరోజు వెళ్తూ వెళ్తూ చంద్రబాబు… ఏరోజైనా టాటా బిర్లాలంత పెద్దవాడినై మీ ముందుకు వస్తానంటూ శపథం చేశాడని వెల్లడించారు.

ఎన్టీఆర్ కల్చర్ ఉన్న వ్యక్తి కాదని… నోటికొచ్చినట్టు పచ్చిబూతులు ఎమ్మెల్యేలను ఉద్దేశించి తిట్టేవారన్నారు. ఒకసారి ఎన్టీఆర్‌ పద్దతి చూసి మేనకా గాంధీ… ధర్టీ ఫెలోను ఎక్కడి నుంచి తెచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు.

కృష్ణా జిల్లాకు చెందిన ఒక కుల పిచ్చోడు హైదరాబాద్‌లో పది ఎకరాలు ఎన్టీఆర్‌కు రాసిచ్చాడని, అందులో గుడిసె వేసుకుని ఎన్టీఆర్ అప్పుడప్పుడూ వచ్చేవాడని నాదెండ్ల వివరించారు. అప్పటికే ఎన్టీఆర్ కు భార్య చనిపోయింది. ఆ వ్యక్తి ఇచ్చిన స్థలంలో ఉంటూ అలాంటి వ్యక్తి కుమార్తెకు కడుపు చేసి ఎన్టీఆర్ నాశనం చేశారన్నారు. పెళ్లి చేసుకోవాల్సిందిగా వారు బతిమలాడితే మీ స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? అంటూ ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని భాస్కరరావు వివరించారు. అలాంటి వ్యక్తి దేవుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ చేసిన పనులు బయటకు చెప్పుకుంటే సిగ్గేస్తుందన్నారు.

రామోజీరావు చిట్‌ఫండ్ కంపెనీని అడ్డుపెట్టుకుని ఆర్థిక అక్రమాలు చేస్తూ… జనాన్ని ఇబ్బందిపెడుతున్నారన్న ఫిర్యాదు రావడంతో అప్పటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి చర్యలకు ఉపక్రమించారని వివరించారు.

ఆ సమయంలో రామోజీరావు అక్రమాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాల్సిందిగా తనను ఆదేశించారని… ఆ పని చేశాను కాబట్టే తానంటే రామోజీరావుకు కోపమని నాదెండ్ల భాస్కర్‌ రావు వివరించారు. మర్రిచెన్నారెడ్డి సొంతూరులో ఇల్లు ఒక గది అంత మాత్రమే ఉండేదని… అది చూసి తానే ఆశ్చర్యపోయానని వివరించారు.

రాయలసీమలో, తెలంగాణలో రెడ్లు బలంగా ఉన్నారు. వీళ్ళు విడిపోతే గానీ మనకు అధికారం రాదు అని వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోవాలని కోరుకున్నారు అని వెల్లడించారు.

First Published:  11 Jan 2019 1:10 AM GMT
Next Story