తాప్సీ ప్రేమ విఫలం

నటి తాప్సీ తన ప్రేమ సంగతులు చెప్పారు. భువనేశ్వర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఆమె… సరదాగా తన చిన్ననాటి ప్రేమ విషయాలు వెల్లడించారు. తాను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డానని చెప్పారు. కానీ ఆ అబ్బాయి తనను వదిలేశాడని చెప్పింది. పదో తరగతి పరీక్షలకు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రేమించిన అబ్బాయి తనను వదిలేశాడని తాప్సీ చెప్పుకొచ్చింది.

అలా స్కూల్‌ లైఫ్‌లోనే తన ప్రేమ విఫలమైందని వివరించింది. పరీక్షల కోసం అబ్బాయి తనను వదిలేయడాన్ని తట్టుకోలేక పోయానంది. ఇంటి వెనుక ఉన్న పబ్లిక్ బూత్‌కు వెళ్లి ఫోన్‌ చేసి నన్ను ఎందుకు వదిలేశావ్ అంటూ అబ్బాయితో ఏడ్చేదాన్ని అని వివరించింది.

అప్పుడైతే ఏడ్చాను గానీ… ఇప్పుడు ఆ సంగతులను తలుచుకుంటే నవ్వొస్తోందని తాప్సీ వ్యాఖ్యానించారు. తనకు భర్తగా వచ్చే వ్యక్తి తన ఆలోచనలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటానని తాప్సీ చెప్పింది. తాను మరోసారి ప్రేమలో పడితే ఆ విషయాన్ని అందరికీ చెబుతానంది తాప్సీ.